ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> RRR Movie Pre Release Business Details

RRR బిజినెస్ చూస్తే.. షాక్ కాదు షేకవ్వాల్సిందే!

RRR Movie Pre Release Business Details

రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలసి హాట్ ఫేవరేట్ గా 2021 సంక్రాంతి బరికి RRR ని సిద్ధం చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈసినిమాపై ట్రేడ్ లోనే కాదు... డిస్ట్రిబ్యూటర్స్ లోను భీబత్సమైనా అంచనాలున్నాయి. ఎన్ని సినిమాలు ఎదురెళ్ళినా RRR సినిమాని కొట్టడం సాధ్యం కాదని వారు డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది వ్యవహారం. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RRR ప్రీ రిలీజ్ లెక్కలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అసలా లెక్కలు చూస్తే బాహుబలిని కొట్టెయ్యడం కాదు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే నైజాంలో దిల్ రాజు 75 కోట్లకి RRR హక్కులను దక్కించుకున్నాడనే న్యూస్ ఉంది.

తాజాగా ఈస్ట్ గోదావరి, సీడెడ్, వైజాగ్, కర్ణాటక, ఓవర్సీస్ లెక్కలు బయటికొచ్చేశాయి. మరి ఈ లెక్కలు చూస్తుంటే రాజమౌళి RRR తో మాములుగా కొట్టేలా కనిపించడం లేదు. సౌత్ లోనే ఈ సినిమాతో 400 కోట్లకు కొల్లగొట్టేలా  కనబడుతున్నాడు. మరి ఇంతవరకు జరిగిన RRR ప్రీ రిలీజ్ లెక్కల వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా      ప్రీ రిలీజ్ లెక్కలు(కోట్లలో)

 

నైజాం            75.00 కోట్లు

సీడెడ్            40.00 కోట్లు

వైజాగ్            30.00 కోట్లు

కర్ణాటక          50.00కోట్లు

ఓవర్సీస్        75.00 కోట్ల

మరి ఇంకా కొన్ని ప్రాంతాలు హక్కులు అమ్మకుండానే దాదాపుగా ఇప్పుడు 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. ఇంకా మిగతా ఏరియాలు, అలాగే డిజిటల్, శాటిలైట్, ముఖ్యంగా బాలీవుడ్ హక్కులు ఇలా ఎలా చూసిన RRR 500 కోట్లకి పైనే ఆదాయం నిర్మాతలకు తేవడం ఖాయంగా కనబడుతుంది.

Shocking Business to RRR Movie at AP and TS

rajamouli
ram charan
ntr
rrr movie
pre release
business
details