‘అప్పుడు ఇప్పుడు’ నుంచి మరో సాంగ్ రిలీజ్

Appudu Ippudu Movie song Released

హీరో సునీల్ చేతుల మీదుగా ‘అప్పుడు- ఇప్పుడు’ సినిమా సాంగ్ విడుదల!! 

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అప్పుడు-ఇప్పుడు’. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. దసరా కానుక‌గా విడుద‌లైన ఫస్ట్ లుక్ కి, కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ చేతుల‌మీదుగా విడుదలైన మొదటి గీతానికి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల‌ మీదుగా విడుదలైన రెండవ పాటకి అద్భుతమైన  స్పంద‌న వ‌స్తోంది. కాగా ఈ చిత్రంలోని మూడవ పాటను  హీరో సునీల్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో సునీల్ మాట్లాడుతూ - ‘‘అప్పుడు - ఇప్పుడు’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అలాగే పద్మానావ్ భరద్వాజ్ సంగీతం కొత్తగా ఉంది. తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తెలుగు సినిమా ప్రేక్షకులని తనదైన హాస్యంతో నవ్వించి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకొని, నటనతో, డాన్స్ లతో హీరోగా హిట్ సినిమాలు అందిస్తున్న హీరో సునీల్ గారి చేతుల మీద మా అప్పుడు ఇప్పుడు సినిమా పాట విడుదలవడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి ...

దర్శకత్వం: చలపతి పువ్వల

నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు 

సంగీతం: పద్మానావ్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి

ఆర్ట్: ఠాగూర్

ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ 

లిరిక్స్: చిరావూరి విజయకుమార్

పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌.

Actor Sunil Launches Appudu Ippudu Movie song

actor sunil
launches
appudu ippudu
movie
song