‘మా - ఏపీ’ ఫిల్మ్ అవార్డ్స్‌కు నామినేటైంది వీరే!

- త్వరలో వైభవంగా ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ -ఏపీ’ ఫిల్మ్ అవార్డ్స్
- తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయనిర్ణేతలు
- భారీగా ఏర్పాట్లు చేస్తున్న మా - ఏపీ
మా - ఏపీ సర్వ సభ్యసమావేశం ఇటీవలే తెనాలిలో జరిగింది. తొలుత ఈ కార్యక్రమంలో స్వర్గీయ శ్రీమతి విజయనిర్మలకు నివాళులు అర్పించారు. అనంతరం మా - ఏపీ 2018లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మా సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌రాజా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సినీ నటి కవిత తెలిపారు. ఎలాంటి జ్యూరీని నియమించకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయమూర్తులుగా తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ప్రజల తీర్పును కవర్‌లో మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి-522201, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు పంపవలసిందిగా కోరారు. తమపేరు, చిరునామా, ఆధార్ కార్డులతో ప్రజలు తమ నిర్ణయాన్ని పంపవలసిందిగా దిలీప్‌రాజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రజలు జులై 1 నుంచి ఆగస్టు 15, 2019 వరకు ఎంట్రీలను పంపవచ్చని అన్నారు. ఇందులో ఎలాంటి సిఫారసులకు తావులేకుండా ప్రజలే నిజమైన తీర్పును ఇవ్వవలసిందిగా కోరారు. ప్రజా నిర్ణయాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని మా - ఏపీ ఫిలిమ్ అవార్డులకు ఎంపిక చేస్తామని తెలిపారు .
అలాగే స్వర్గీయ విజయనిర్మల స్మారక అవార్డును ప్రముఖ దర్శకులకుగాని, ప్రముఖ మహిళా నటీమణికిగాని ఇవ్వడం జరుగుతుంది.
ఈ అవార్డు ఫంక్షన్ త్వరలో తెనాలిలో వైభవంగా జరగనుందని తెలిపారు. ప్రజాతీర్పు అనంతరం తెలంగాణ, ఆంధ్ర్రపదేశ్ రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్లుగా దర్శకుడు దిలీప్‌రాజా, మా - ఏపీ అధ్యక్షులు కవిత చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులు, మా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నర్సింహరాజు, జయశీల, మా అసోసియేషన్ నిర్వహణ కమిటీ ఛైర్మన్ బాసింశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
మా- AP నామినేషన్లు:
ఉత్తమ చిత్రం: భరత్ అనునేను, రంగస్థలం, గీత గోవిందం, మహానటి, అరవిందసమేత
ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం: అంతరిక్షం, నీదినాది ఒకేకథ, ఆర్ ఎక్స్ 100, కంచెరపాలెం.
ఉత్తమ నిర్మాత: దిల్‌రాజు, డి.దానయ్య, మైత్రిమూవీస్, అశ్వినిదత్, బన్నీవాసు.
ఉత్తమ దర్శకుడు: కొరటాలశివ(భరత్ అను నేను), సుకుమార్(రంగస్థలం), త్రివిక్రమ్ శ్రీనివాస్(అరవిందసమేత), నాగఅశ్విన్(మహానటి), సంకల్పరెడ్డి (అంతరిక్షం), అజయ్ భూపతి (ఆర్ ఎక్స్ 100)
ఉత్తమ హీరో: మహేష్‌బాబు(భరత్ అను నేను), రామ్‌చరణ్ (రంగస్థలం), జూనియర్ ఎన్టీఆర్ (అరవింద సమేత), విజయ్‌దేవరకొండ (గీతగోవిందం), వరుణ్‌తేజ్ (తొలిప్రేమ)
ఉత్తమ హీరోయిన్: సమంత (రంగస్థలం), కీర్తిసురేష్(మహానటి), రాశిఖన్నా (తొలిప్రేమ), రష్మిక (గీత గోవిందం), పాయల్‌రాజ్‌పుత్ (ఆర్ ఎక్స్ 100)
ఉత్తమ విలన్: జగపతిబాబు (రంగస్థలం), ప్రకాష్‌రాజ్ (భరత్ అను నేను), దుల్కర్ సల్మాన్ (మహానటి), విజయవర్మ (ఎంసిఎ), ఎస్.జె.సూర్య (స్పైడర్)
ఉత్తమక్యారెక్టర్ నటుడు: ఆది పినిశెట్టి (రంగస్థలం), రాజేంద్రప్రసాద్ (శ్రీనివాస కళ్యాణం), రాకీ (ఆర్ ఎక్స్ 100), నరేష్ (శతమానం భవతి)
ఉత్తమ క్యారెక్టర్ నటి: సుహాసిని (తొలిప్రేమ), నిత్యామీనన్ (ఆర్ ఎక్స్ 100), అనసూయ(రంగస్థలం), నందిత (శ్రీనివాస కళ్యాణం)
ఉత్తమ హాస్యనటుడు: వెన్నెల కిషోర్, ప్రియదర్శి, మహేష్, రాహుల్‌రామకృష్ణ.
ఉత్తమ హాస్య నటి: విద్యులేఖారమణ్(బుజ్జమ్మ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీప్రసాద్, మిక్కిజెమేయర్, తమన్, గోపిసుందర్, చేతన్ భరద్వాజ్.
Andhra Pradesh Movie Artist association announces Film Awards
Maa AP Film Awards Nominations







































