Advertisementt

జాన్వీ కపూర్.. కష్టమే..!!

Sun 22nd Jul 2018 12:02 PM
jhanvi kapoor,dhadak movie,released  జాన్వీ కపూర్.. కష్టమే..!!
Jhanvi Kapoor Dhadak Movie Released జాన్వీ కపూర్.. కష్టమే..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో నాలుగు సినిమాలతో పాటుగా బాలీవుడ్ లోను నిన్న శుక్రవారం భారీ అంచనాల నడుమ బాలీవుడ్ అతిరధ మహారథుల ఆశీస్సులతో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ వెండితెర తెరంగేట్ర మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కూతుర్ని వెండితెర మహారాణిగా చూడాలని శ్రీదేవి కలలుకనింది. కానీ ఆ కల తీరకముందే శ్రీదేవి కన్ను మూయడంతో.. ఆమె పెద్ద కూతురు తండ్రి, స్టెప్ బ్రో అర్జున్ కపూర్ హెల్ప్ తో తన తెరంగేట్ర మూవీ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చెయ్యడమే కాదు.. తన ఫస్ట్ హీరో ఇషాన్ ఖట్టర్ తో కలిసి భారీ ప్రమోషన్స్ తో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు శశాంక్ ఖైతాన్ మరాఠీ లో సూపర్ డూపర్ హిట్ అయిన సైరాత్ సినిమాని జాన్వీ హీరోయిన్ గా బాలీవుడ్ లో ధఢక్ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాతో జాన్వీ కపూర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనే మాట బాలీవుడ్ ధఢక్ రివ్యూస్ చూస్తుంటేనే అర్ధమవుతుంది.

మరి తల్లి అందాన్ని పుణికి పుచ్చుకుని పుట్టిన జాన్వీ కపూర్ మాత్రం తల్లి నటనను మాత్రం ఒంటబట్టించుకోలేకపోయింది. అయితే మొదటి సినిమాకే మనం అలా అనడం భావ్యం కాదు కానీ... ఇక ధఢక్ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా ఒరిజినల్ సైరత్ లో గ్రామీణ నేపథ్యంలో ఒరిజినాలిటీ బేస్ మీద సినిమా చేసి హిట్ కొట్టాడు దర్శకుడు నాగరాజ్. కానీ ఇక్కడ హిందీ ధఢక్ లో మాత్రం ఆ ఒరిజినాలిటీనే మిస్ అయ్యింది. మితిమీరి ఖర్చు పెట్టే నిర్మాత చేతిలో ఉన్నప్పటికీ... దర్శకుడు ఆచి తూచి సినిమా చేశాడా అనిపిస్తుంది. ఒక రొటీన్ ప్రేమ కథని తీసుకుని అందులో కొత్తవారిని పెడితే ఎలా ఉంటుందో.. సేమ్ అలానే ధఢక్ సినిమా ఆద్యంతం కనబడుతుంది. అటు హీరో ఇషాన్ కొత్తవాడు, ఇటు జాన్వీ కపూర్ కొత్త అమ్మాయి. ఇద్దరు కొత్తవారే కావడంతో.. తమ తమ పాత్రలకు ఇద్దరూ న్యాయం చేయలేకపోయారు. అలాగే దర్శకుడు శశాంక్ వారినుండి నటనను కావాల్సినట్టుగా రాబట్టలేకపోయాడు. ఇక జాన్వీ కపూర్ నటనలోనూ, డైలాగ్ డెలివరీలోను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. కొన్ని చోట్ల లుక్స్ పరంగా బావుంది అనుకున్నప్పటికీ.. మరికొన్ని చోట్ల జాన్వీ తేలిపోయింది. 

కొన్ని చోట్ల మెరుగైన ఎక్సప్రెషన్స్ తో జాన్వీ మెప్పించింది. ఇక కేవలం ఈ సినిమా ప్లాప్ కి కారణం హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు... ఈ సినిమా దర్శకత్వం విషయంలోనూ ఫెయిల్ అయ్యింది. ఇక సినిమాటోగ్రాఫర్  అండ్ నిర్మాత కరణ్ జోహార్ పెట్టిన ఖర్చు కోసమే సినిమాకి వెళ్ళాలి అంటే అంత టికెట్ పెట్టుకుని థియేటర్ కి వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఇక శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ కి అమ్మ అంతటి స్టార్ డమ్ తెచ్చుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇప్పటికే అర్ధమై ఉండాలి. ఇక శ్రీదేవి లేని లోటు జాన్వీ కపూర్ భర్తీ చెయ్యాలి అంటే... శ్రీదేవి అభిమానులకు ఎన్ని ఏళ్లు పడుతుందో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

Jhanvi Kapoor Dhadak Movie Released:

Mixed Comments on Jhanvi Kapoor Acting in Dhadak

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ