'కుశ' టీజర్: కొట్టడం కుదరలా..!!

'జై లవ కుశ' ల టీజర్ల హడావిడి ఎట్టకేలకు ముగిసింది. జై టీజర్ తో ఎన్టీఆర్ అద్భుతమైన నటన, ఆహార్యంతో ఆకట్టుకోగా, లవ టీజర్ తో కూల్ గా, స్మూత్ గా, స్టైలిష్ గా ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు కుశ టీజర్ లో కొంచెం వెరైటీ గా పరిచయమయ్యాడు. కుశ లుక్ తోనే ఆ పాత్రపైనా ఇంటెన్షన్ పెంచిన చిత్ర బృందం ఈ శుక్రవారం కుశ టీజర్ ని కూడా విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు 'జై లవ కుశ' థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో 'జై లవ కుశ'లోని బ్యాలెన్స్ కుశ టీజర్ ని కూడా విడుదల చేసేశారు.

ఈ టీజర్ లో కుశ పాత్ర దొంగలా కనబడుతుంది. ఇక టీజర్ మొదట్లోనే ఎన్టీఆర్ అదిరిపోయే డాన్స్ స్టెప్స్ తో దడ దడ లాడించేస్తూ రంగులతో రచ్చ చేశాడు. అంతే కాకుండా చిన్న యాక్షన్ పార్ట్ కూడా కుశ టీజర్ లో చూపించారు. అయితే కుశ కి అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు సంపాదించేసి అక్కడే సెటిల్ అవ్వాలనే కోరిక ఉంటుంది. దానికోసమే బోలెడు డబ్బుని తీసుకొస్తాడు.అయితే ఎన్టీఆర్ 'ఈ డబ్బు తీసుకుని అమెరికాలో ఇన్విస్ట్ చేసి ఆ ఆధార్ కార్డ్ ఏదో ఇప్పించండి బాబు' అంటూ అడగగా... ఎదుట వున్న వ్యక్తి అది ఆధార్ కార్డు కాదు గ్రీన్ కార్డు అంటాడు. ఇక అదే చోట యాక్షన్ సన్నివేశం కూడా ఉంటుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ చేస్తూ 'కొట్టేయడంతోపాటు కొట్టడం కూడా వచ్చు’ అనే డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. 

జై టీజర్, లవ టీజర్ లాగే కుశ టీజర్ కూడా క్వాలిటీగా, క్లారిటీగా ఉన్నప్పటికీ జై టీజర్ లాగా ఈ లవ, కుశ టీజర్స్ లేవంటున్నారు. జై పాత్రలో ఎన్టీఆర్ ఇరగదీస్తుంటే... లవ, కుశ టీజర్స్ లో ఎన్టీఆర్ చాలా రొటీన్ గా వున్నాడంటున్నారు. ఇకపోతే దేవిశ్రీ మ్యూజిక్ 'జై లవ కుశ' కి సరిపోయే మ్యూజిక్ కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతూనే ఉన్నాయి. మరి సినిమాలో దేవిశ్రీ మ్యూజిక్ ఎలా వుండబోతుందో గాని 'జై లవ కుశ' పాటలకు మాత్రం పాత వాయింపు వాయించాడనే టాక్ వినబడుతుంది. చూద్దాం 10 న విడుదల కాబోయే 'జై లవ కుశ' ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో? ఇక 'జై లవ కుశ' ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Click Here to see the KUSA Teaser

Jr NTR Jai Lava Kusa - Kusa Teaser Talk

Jai Lava Kusa- Kusa Teaser Released
jai lava kusa
kusa teaser
kusa teaser talk
jai lava kusa movie kusa teaser released
jr ntr
kalyan ram
bobby