ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli to Launch Uyyalawada Narasimhareddy Motion Poster?

చిరు 151 కి రాజమౌళి పాత్ర..!

చిరంజీవి 151 వ చిత్రం స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు కొద్దిమంది అతిధుల మధ్యన సైలెంట్ గా ముగించేసిన విషయం తెలిసిందే. సినిమా ఓపెనింగ్ సైలెంట్ గా చేసినా చిరు బర్త్ డే ఆగష్టు 22 న మాత్రం మెగా ఫాన్స్ కే కాకుండా అందరికి ఒక మెగా ట్రీట్ ఇవ్వబోతున్నామంటూ కొణిదెల ప్రొడక్షన్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. మూడు నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.

ఇక ఆగష్టు 22 న మెగా స్టార్ చిరు బర్త్ డే రోజున మెగా ఈవెంట్ గా ఈ 151  సినిమా మోషన్ పోస్టర్ తోపాటు టైటిల్ ని కూడా లాంచ్ చెయ్యబోతున్నారు. సినిమా సైలెంట్ గా మొదలైనా మిగతా కార్యక్రమాలన్నీ భారీగా జరిగే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరు 151 వ మూవీ పోస్టర్ ని రాజమౌళి తనయుడు కార్తికేయ డిజైన్ చేశాడనే టాక్ వినబడుతుంది. అందుకే ఈ మోషన్ పోస్టర్ లాంచ్ కి దర్శక ధీరుడు రాజమౌళిని తీసుకొస్తే ఈ సినిమాకి ఇండియా వైడ్ గా క్రేజ్ వచ్చేస్తుందని భవించి ఈ పోస్టర్ లాంచ్ ని ఆయన చేతుల మీదుగా ప్లాన్ చేస్తున్నారట 151 మూవీ టీమ్. మాగ్జిమమ్ రాజమౌళి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం వుండవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్.

మరి ఇండియా వైడ్ గా సినిమాకి హైప్ తీసుకురావాలంటే ఇలాంటి భారీ హడా విడి ఉండాల్సిందే అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో ఆ నాలుగు భాషలకు సంబందించిన నటీనటులను తీసుకోవడం కోసం చిత్ర టీమ్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో నటించే నటీనటుల వివరాలను కూడా ఆగష్టు 22  నే రివీల్ కానున్నాయంటున్నారు.

Director Rajamouli would launch the motion poster of Uyyalawada Narasimhareddy on 22nd of this month.

Rajamouli to Launch Uyyalawada Narasimhareddy Motion Poster?
uyyalawada narasimhareddy
chiranjeevi
mega star
ss rajamouli
Advertisement
Advertisement