ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajinikanth Meets Big B for Political Suggestions

రజనీ లొంగకుంటే..ప్రజలే చూసుకుంటారు!

Rajinikanth Meets Big B for Political Suggestions

రజనీ ఇటీవల 'కాలా' షూటింగ్‌ సందర్భంగా ముంబైలో ఉన్నప్పుడు ఆయన బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ని కలిసినట్లు బాలీవుడ్‌ మీడియా అంటోంది. ఆ సందర్భంగా రజనీ రాజకీయ అరంగేట్రం గురించి కూడా వారిద్దరి మధ్య చర్చ వచ్చిందంటున్నారు. నాటి గాంధీ కుటుంబానికి, మరీ ముఖ్యంగా రాజీవ్‌గాంధీకి సన్నిహితుడైన తాను రాజకీయాలలోకి ప్రవేశించి ఎంపీగా గెలుపొందడం, తదుపరి పరిణామాలతో పాటు చిరంజీవి ప్రజారాజ్యాం పార్టీ ప్రస్తావన కూడా వారిరువురి మధ్య వచ్చిందంటున్నారు. 

రాజకీయాలలో తనకున్నంత అనుభవం మొత్తం ఆయన రజనీకి చెప్పాడని, తుది నిర్ణయం మాత్రం అమితాబ్‌.. రజనీకే వదిలేశాడని టాక్. ఇక తమిళనాడు రాజకీయ పరిస్థితుల విషయానికి వస్తే రజనీకి బిజెపిలో చేరే ఉద్దేశ్యం లేదని తమిళ ప్రజలు ఎంతటి పెద్ద హీరో అయినా సరే కేవలం ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతారు తప్ప బిజెపి, కాంగ్రెస్‌లకు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ, అనివార్యమైనా కూడా మద్దతు ఇవ్వరంటున్నారు. 

ఇక చిరంజీవి ఎపిసోడ్‌ని పక్కనపెడితే తమిళనాడులో నిజంగానే ఇప్పుడు రాజకీయ సంక్షోభం, రాజకీయ అనిశ్చితి  ఉన్నాయని, తమపై పెత్తనం చెలాయించాలని, దానికి ఇదే సమయమని బిజెపి చేస్తున్న రాజకీయాల పట్ల కూడా తమిళులు ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. రజనీ ఖచ్చితంగా రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి కేంద్రంలోని బిజెపి బెదిరింపులకు లొంగకుండా ఉంటే మాత్రం ఆయన సీఎం కావడమే కాదు.. కేంద్రం రజనీ పట్ల కక్ష్య సాధించుకున్నా కూడా ప్రజలు రజనీ వెంటే ఉంటారని, నాటి ఎన్టీఆర్‌, నాదెండ్ల ఎపిసోడ్‌లాగానే రజనీకే జనాలు పట్టం కడతారని ఓ ప్రముఖ తమిళ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 

కాబట్టి అమితాబ్‌, చిరంజీవిలను పక్కనపెట్టి ఎన్టీఆర్‌ , జయలలితలాగా ఉక్కుపిండంగా నిలిచే ధైర్యం ఉంటే మాత్రం రజనీదే విజయమని ఆ కథనం తేల్చిచెప్పింది. 

Reports are doing the rounds that superstar Rajinikanth is likely to consult megastar Amitabh Bachchan before taking the political plunge.

rajinikanth
politics
amitabh bachchan
tamil nadu