లాంచ్‌కు సిద్దమయిన 'జాగ్వార్‌'....!

మాజీ దేశప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ గౌడను హీరోగా పరిచయం చేస్తూ.. దాదాపు 70కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'జాగ్వార్‌'. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కధను అందించిన ఈ చిత్రాన్ని మహదేవ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం కన్నడ, తెలుగుభాషల్లో దసరా కానుకగా అక్టోబర్‌ 6 వ తేదీన విడుదల కానుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నఈ చిత్రం ఆడియో విడుదలకు సర్వం సిద్దమైంది, కాగా ఈ వేడుకకు కుమారస్వామి పిలుపుమేరకు పవన్‌కళ్యాణ్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హాజరుకానున్నాడు. ఈచిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు. మరి ఈ చిత్రంలోని పాటలు ఎంతటి హిట్‌ను సొంతం చేసుకుంటాయి? పవన్‌ రాక కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్ర యూనిట్‌ ఆయన అభిమానుల సహాయసహకారాలను ఎంతవరకు నిలబెట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది. 

jaguar movie
audio launch
top celebrities
pawan kalyan
kcr
audio launch today