ప్రభుదేవా జీవితంలో మధుర క్షణాలివే!

నిన్నటితరం డ్యాన్స్‌ మాస్టర్స్‌లో సుందరం మాష్టారుది ప్రత్యేకమైన శైలి. ఇక ఆయన కుమారుడు ప్రభుదేవా ఇండియన్‌ మైఖేల్‌జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి ఒకేసారి స్టెప్పులేయడం చాలా అరుదు. కాగా ఇటీవల ఓ ప్రెవేట్ టీవీ చానెల్‌ ప్రోగ్రాంలో తండ్రికొడుకులు సుందరం మాష్టార్‌, ప్రభుదేవా కలిసి స్టేజీపై కాసేపు కలసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రభుదేవా ఇవి నా జీవితంలో మధురమైన క్షణాలని ట్వీట్‌ చేయడమే కాదు.. ఆ వీడియోను రీపోస్ట్‌ చేశాడు. ఇది ప్రభుదేవాకే కాదు.. యావత్‌ సినీ ప్రేక్షకులకు మధురమైన కానుకే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ప్రభుదేవా విజయ్‌ దర్శకత్వంలో తాను కూడా కలిసి నటిస్తూ, తమన్నా, సోనూసూద్‌ ప్రధానపాత్రల్లో 'అభినేత్రి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగువెర్షన్‌కు కోనవెంకట్‌ నిర్మాత కాగా, తమిళంలో ఈ చిత్రాన్ని ప్రభుదేవా తన స్వీయనిర్మాణంలో 'డెవిల్‌' టైటిల్‌తో విడుదలకు రెడీ చేస్తున్నాడు. ఇక హిందీలో ఈ చిత్రాన్ని సోనూసూద్‌ 'టుటక్ టుటక్ టుటియా' అనే పేరుతో రిలీజ్‌ చేయనున్నారు. 

prabhu deva
sundaram master
tutak tutak tutiya
abhinetri
devil
prabhu deva and sundaram master dance