ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
బన్నీ దారిలోనే శిరీష్ కూడా..!

అల్లుశిరీష్ హీరోగా.. లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా గీతాఆర్ట్స్ పతాకంపై పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'శ్రీరస్తు..శుభమస్తు'. కాగా ఈచిత్రం ఆడియోను ఎలాంటి హడావుడి లేకుండా నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసి, ట్రైలర్స్‌ను, సాంగ్స్ టీజర్స్‌ను వదులుతున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ పతాకంపై రూపొందిన 'సరైనోడు' చిత్రం ప్రమోషన్ విషయంలో కూడా ఇదే స్ట్రాటర్జీని అల్లుఅర్జున్, అల్లుఅరవింద్‌లు ప్లాన్ చేసి హిట్టును కొట్టారు. కాగా ఇప్పుడు అల్లు శిరీష్ విషయంలో కూడా అదే రూట్‌ను ఫాలో అవుతున్నాడు అల్లుఅరవింద్. ఈ చిత్రం ఆగష్టు5న విడుదలకు సిద్దమవుతోంది. మరి 'సరైనోడు' రూటులోనే 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం కూడా హిట్‌ను అందుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది!
allu arjun
sarainodu
allu sirish
srirastu subhamastu
promotion







































