ట్రైలర్ తో హైప్ పెరిగి పోయింది..!

CineJosh news

జీవిత కథల ఆధారంగా తెరకెక్కించే సినిమాలలో నటించడంలో అక్షయ్ కుమార్ కి తిరుగే లేదు. ఈ మధ్య వచ్చిన ఎయిర్ లిఫ్ట్ చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓ నేవీ అధికారి నిజ జీవిత కథ తో 'రుస్తుం' సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఒక ట్రైలర్ ని యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో నేవీ అధికారిగా.. పాత్రలో ఒదిగిపోయి నటించేసాడు. ముంబై లో సంచలనం సృష్టించిన నేవల్ కమాండర్ నానావతి లైఫ్ స్టోరీతో ఈ 'రుస్తుం' చిత్రం తెరకెక్కుతుంది. అయితే రీల్ లైఫ్ లో నానావతి తన భార్య ప్రేమికుడిని చంపేసి హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ కథ ఆధారంగా 'రుస్తుం' అనేక మలుపులతో తెరకెక్కుతుంది. మరి రీల్ లైఫ్ లో ఈ సినిమాని ఎలా తీశారనేదే ఆసక్తికర అంశం. ఈ సినిమాలో అక్షయ కుమార్ కి జోడిగా ఇలియానా చేస్తుండగా మరో నటి ఇషా గుప్తా గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమాకి తీను సురేష్ డైరెక్టర్. ఆగస్ట్ 12 న మూవీని  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

akshay kumar
ileana
rustom
rustom trailer
isha gupta
O.M Review
O.M Review
20 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
20 Nov 2026
DNK Review
DNK Review
20 Nov 2026
GOAT Review
GOAT Review
20 Nov 2026
Scene Review
Scene Review
20 Nov 2026
Ramayana Review
Ramayana Review
20 Nov 2026