అభిమానుల కోసమే సర్దార్ గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం కళ్ళు కాయలు కాసేలా అభిమానులు వేచి చూస్తున్నారు. షూటింగ్ విషయంలో కాసింత జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినా ఇది కేవలం అభిమానులను అలరించడానికే అన్న సంగతి మనందరం గమనించాలి. జరిగిన టైం వేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అయ్యేలా పవన్ ఇప్పుడు అహర్నిశలు ఈ చిత్రం కోసమే పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ స్వయంగా వెల్లడించారు. ఈ రోజు జరిగిన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ చాలా సంతృప్తిగా అనిపించింది. ఈ ప్రాజెక్టులో భాగమయినందుకు నాకు ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి నుండి బెస్ట్ అనిపించేలా ఈ చిత్రం ఉండబోతోంది. ఆయన పడిన కష్టం మొత్తానికి సత్ఫలితం కనపడుతోంది. అభిమానులు ఆయన నుండి ఏం కోరుకుంటారు అన్నదాంట్లో పవన్ గారికి చాలా స్పష్టత ఉంది. అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ పరిపూర్ణమైన ఫ్యాన్స్ సినిమాగా, ఆద్యంతం వినోదం పంచేలా తయారయింది అంటూ చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ విజయం దరిమిలా సర్దార్ గబ్బర్ సింగ్ మరిన్ని అంచనాల మధ్య రానున్న వేసవి సెలవుల్లో రిలీజుకు సిద్ధమవుతోంది. పవర్ ఫేం బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

sardaar gabbar singh
pawan kalyan
sharat marar