ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్ చేయలేనిది సుధీర్‌బాబు చేస్తున్నాడు..!

మహేష్‌బాబు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే అది మాత్రం వర్కౌట్ కాలేదు. తాజాగా ఆయన బావ సుదీర్‌బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇటీవలే విడుదలై ఫ్లాప్‌టాక్ తెచ్చుకుంది. త్వరలో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ విడుదలకు సిద్దమవుతోంది. కాగా సుధీర్‌బాబు త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘భాగీ’ అనే బాలీవుడ్ మూవీలో నటించేందుకు ఆయన సైన్ చేశాడు. జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ కీలకపాత్రలో సుధీర్‌బాబు నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. త్వరలో ఈ షూటింగ్‌లో సుధీర్ జాయిన్ అవుతాడు.
sudheerbabu
maheshbabu
mosagallaku mosagadu
bhaaghi







































