సెంటిమెంట్‌ను ఫాలో అవుతోన్న మహేష్‌..!

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు ఓ సెంటిమెంట్‌ ఉంది. అదేమిటంటే సినిమా ముహూర్తాలకు ఆయన హాజరుకాడు. యూనిట్‌ సభ్యులే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తారు. ఇప్పుడు పివిపి బేనర్‌లో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు నటించనున్న ‘బ్రహోత్సవం’ చిత్రం ముహూర్తానికి కూడా మహేష్‌బాబు రాలేదు. దీంతో యూనిట్‌సభ్యులే పూజాకార్యక్రమాలను నిర్వహించారు. మరి ఈ సెంటిమెంట్‌ మహేష్‌కు ఎందుకు? ఎలా? వచ్చింది అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. అలా ఆయన రాకుండా చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయా అంటే అదీ లేదు. మరి ఈ సెంటిమెంట్‌కు కారణం ఏమిటో ఆయనకే తెలియాలి..!

brahmothsawam
maheshbabu
pvp banner
sreekanth addala