ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
దిగ్గజాన్ని ఢీకొంటున్న కుర్రాడు....!

క్రియేటివ్ జీనియస్ మణిరత్నం తన సర్వశక్తులు ఒడిగట్టి ఈ తరం దర్శకులకు పోటీగా నిలవాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన చిత్రం ‘ఓకే కన్మణి’. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారనే సరికి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘స్వామిరారా’ వంటి ఒకే ఒక చిత్రం అనుభవం ఉన్న కుర్రాడు సుధీర్‌వర్మ నాగచైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘దోచెయ్’ కూడా అదే తేదీన విడుదలకు సిద్దమవుతోంది. విచిత్రం ఏమిటంటే.. ఈరెండు చిత్రాలు యువతను టార్గెట్ చేసినవి కావడమే విశేషం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సందడి చేస్తుందో చూడాలి...!
ok bangaram
dohchay
naga chaithnya
nitya meenan
manirathnam







































