కమల్‌కు టాప్ హీరో బహిరంగ క్షమాపణ!

లోకనాయకుడు కమల్‌హాసన్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌. కమల్‌హాసన్‌ సినిమా ‘విశ్వరూపం’ విడుదల సమయంలో కమల్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలేమో...! అని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఆ సమయంలో పరిశ్రమ మొత్తం ముందుకు రానున్నప్పటికీ సినీ ప్రముఖులు కొందరు వ్యక్తిగతంగా కమల్‌కు మద్దతు పలికారు. అయితే ఆ సమయంలో వేరే పని ఒత్తిడిలో ఉండటం వల్ల తాను కమల్‌కు మద్దతు ప్రకటించలేకపోయానని అమీర్‌ సంజాయిషీ చెప్పాడు. తాజాగా కమల్‌తో కలిసి ఓ కార్యక్రమంలో అమీర్‌ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ‘విశ్వరూపం’ విడుదల విషయంలో కమల్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి నడవాలి. కానీ, వేరే పని ఒత్తిడి వల్ల వ్యక్తిగతంగా మద్దతు తెలపలేకపోయాను. ఈ విషయమై ఇప్పటికీ చింతిస్తుంటాను.  ఈ విషయంలో కమల్‌కు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను.. అని అమీర్‌ వ్యాఖ్యానించాడు. 

ameer khan
kamal haasan
ameer say sorry to kamal
bollywood hero