ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఇక నుంచి ఆయన బిరుదు మెగాసుప్రీంహీరో..!

మెగా మేనల్లుడుగా పరిశ్రమకు పరిచయమైన హీరో సాయిదరమ్‌తేజ్. ఆయన మొదటి చిత్రం ‘రేయ్’ ఎంతకీ విడుదలకాకపోవడంతో ఆయన నటించిన రెండో చిత్రం ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంతో పరిశ్రమకు, ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తొలిసినిమాతో ఫర్వాలేదనిపించుకున్న ఆయన నటించిన తొలి చిత్రం ‘రేయ్’ ఈనెల 27న విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం నుండి ఆయన టైటిల్ కార్డ్స్‌లో ‘మెగా సుప్రీం స్టార్’గా సంబోదించనున్నారు. ఇదే బిరుదును ‘రేయ్’ చిత్రం సినిమా స్క్రీన్లపై కూడా వీక్షించవచ్చు. వచ్చి ఒకటి రెండు చిత్రాలు కాలేదు.. అప్పుడే సాయిదరమ్‌తేజ్‌కి మెగాస్టార్‌లోని మెగా, ఒకప్పటి సుప్రీం హీరోలోని సుప్రీం పదాలను చేర్చి అభిమానులు మెగా సుప్రీంస్టార్‌గా బిరుదు ఇవ్వడాన్ని కొందరు జోక్‌గా తీసుకుంటుండగా, మెగాభిమానులు మాత్రం అందరూ చేస్తున్న పనే మేమూ చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్నారు.
sai dharam tej
rey
mega supreme star
mega supreme







































