వాటికి కూడా ఓకే అంటోన్న రాశిఖన్నా...!

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ రాశిఖన్నా. అందం, అభినయంతోపాటు లౌక్యం తెలిసిన హీరోయిన్‌గా ఈమె పేరుతెచ్చుకుంటోంది. ప్రస్తుతం ఆమె గోపీచంద్‌ సరసన ‘జిల్‌’, రవితేజ సరసన ‘బెంగాల్‌టైగర్‌’ చిత్రాలను చేస్తోంది. కాగా ఈ అమ్మడు ఐటం సాంగ్స్‌ వస్తే వాటిని కూడా చేస్తానని, వాటి విషయంలో తనకు ఎలాంటి కండీషన్స్‌ లేవంటోంది. మంచి ఐటంసాంగ్‌ ఆఫర్స్‌ వస్తే ఖచ్చితంగా చేస్తానని, నేటి సినిమాల విజయంలో ఐటంసాంగ్స్‌కు కూడా మంచి ప్రాదాన్యం లభిస్తోందని అంటోంది. అంతేగాక మంచి రెమ్యూనరేషన్‌తో పాటు తన డ్యాన్స్‌ ప్రతిభను కూడా చూపించే అవకాశం ఉంటుందని ఆమె తన అభిప్రాయంగా చెబుతోంది. అంటే త్వరలో ఐటంసాంగ్స్‌లో కూడా రాశిఖన్నాను చూసే భాగ్యం టాలీవుడ్‌ ప్రేక్షకులకు లభించనుంది.

rashi khanna
item song
gopichand
jil
bengal tiger