మహేష్‌ వస్తే సినిమాలు ఆడుతాయా...?

మహేష్‌బాబు ఎవరికి పడితే వారి సినిమాల ఫంక్షన్‌లకు పోడు... అరుదుగా మాత్రమే మహేష్‌ ఆడియో వేడుకలకు గెస్ట్‌గా వస్తాడు.దాంతో ఆయన వస్తాడు అంటే సినిమా గురించి అందరికీ తెలుస్తుంది. తర్వారా బిజినెస్‌ బాగా జరుగుతుందని అందరూ భావిస్తారు. మహేష్‌ తన బావ సుధీర్‌బాబు చిత్రాలకు గెస్ట్‌గా వస్తున్నాడు. అయితే అది ఎంత వరకు ప్లస్‌ అవుతుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. గతంలో ఆయన సుధీర్‌బాబు చేసిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ చిత్రం ఆడియోకు సైతంవచ్చాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిలయింది. అయినా కనీసం మహేష్‌ వల్ల అయినా సుధీర్‌బాబు అనే వ్యక్తి చాలా మందికి తెలిశాడని, అదే మహేష్‌ పట్టించుకోకపోతే ఆయన పేరు కూడా ఇప్పటికీ ఎవ్వరికీ తెలిసివుండే అవకాశం లేదనేది వాస్తవం. కాగా విషయానికి వస్తే సుధీర్‌బాబు నటిస్తున్న ‘మోసగాళ్లకు మోసగాడు’ ఆడియో వేడుకకు మహేష్‌ గెస్ట్‌గా రానున్నాడని, అయినా సినిమాలో విషయంలేకపోతే ఆయన వచ్చినా ఏమి ప్రయోజనం అనేది కొందరి అభిప్రాయం. 

mahesh babu
audio functions
sudheer babu
mosagallaku mosagadu