ఇలియానాను త్రివిక్రమ్‌ ఒప్పించాడా...?

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి’ చిత్రంలో అల్లుఅర్జున్‌ సరసన ఇలియానా నటించింది. కాగా ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రంలో ఇలాయానా చేత ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయించే పనిలో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌ తాజా సమాచారం. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక ఐటంసాంగ్‌లో ఇలియానాను ఒప్పించే పనిలో త్రివిక్రమ్‌ ఉన్నాడని, అందులో ఆయన విజయం కూడా సాధించాడని అంటున్నారు. మరి ఈ మద్యకాలంలో చాలాగ్యాప్‌ తర్వాత ఇలియానా కనిపించనున్న చిత్రం ఇదే. ప్రస్తుతం తమిళంలో ‘జులాయి’ రీమేక్‌ ‘సాహసం’లో ప్రశాంత్‌ వంటి సీనియర్‌ స్టార్‌ సరసన నటించేందుకు ఇలియానా అంగీకరించిన సంగతి తెలిసిందే. 

trivikram
julayi
iliyana
allu arjun
son of sathyamurthy
Advertisement
Advertisement