పాత దారిలో 'సూర్య'..!

తమిళ స్టార్ హీరో సూర్య  వైవిధ్యానికి పెద్ద పీట వేస్తాడనే పేరుంది. అప్పటి 'శివపుత్రుడు' నుండి నిన్నటి 'బ్రదర్స్' వరకు ఆయన ఎన్నో ప్రయోగాత్మక  చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఈ మధ్య మాత్రం ఆయన కమర్షియల్ సినిమాల దారి పట్టాడు. అలా చేసిన వాటిల్లో 'సింగం' సిరీస్ తప్ప ఆయనకు మంచి విజయాలు లభించడం లేదు. ఇటీవల వచ్చిన 'అంజాన్' చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సూర్య తన నుండి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మాస్' అనే చిత్రం చేస్తున్నాడు. ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో  జేమ్స్ బాండ్ తరహ అడ్వంచరస్ థ్రిల్లర్ గా రూపొందనుందని.. ఇందులో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించనుందని సమాచారం. మొత్తానికి సూర్య మరల తనదైన వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందించదగిన విషయమే అని చెప్పకతప్పదు. 

thamil star
surya
venkat prabhu
maas movie
adventure thriller