చిరు అలా ఎందుకు చేస్తున్నారు..?

చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు అంటీముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక కార్యమ్రాల్లోనూ ఆయన పాలుపంచుకోవడం లేదు. ఇటీవల విజయవాడలో జరిగిన ఏపీ కాంగ్రెస్‌ సదస్సుకు కూడా చిరంజీవి హాజరుకాకపోవడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. ఇప్పటికే పార్టీ దారుణమైన స్థితిలో ఉందని, ఇప్పుడు చిరు కూడా పార్టీకి దూరమైతే కాంగ్రెస్‌ తన అస్థిత్వం కూడా కోల్పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక తన 150వ చిత్రానికి సంబంధించిన పనుల్లో చిరు బిజీగా ఉంటే అర్థం చేసుకోవచ్చని, కాని ఆయన అటు ఆ సినిమా మొదలుపెట్టకుండా ఇటు పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండటం ఏమాత్రం సబబు కాదని హస్తం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా కూడా ఫిర్యాదు చేయాలని కొందరు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

chiranjeevi
150 film
congress party
resigning