చిరుకి సలహా ఇస్తున్న వర్మ..!

విమర్శాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో కాంట్రవర్సి ఇష్యూ తో వార్తల్లోకెక్కారు. తన దగ్గర  శిష్యుడుగా చేసిన పూరిజగన్నాథ్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. పూరి డైరెక్ట్ చేసిన 'టెంపర్' మూవీ రిలీజ్ కు ముందు నుంచే వర్మ పూరి ను, ఎన్టీఆర్ ను పొగుడుతూ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు సినిమా చూసిన వర్మ మెగా ఫ్యామిలీ కి ఓ సజెషన్ ఇచ్చాడు. చిరంజీవి 150వ సినిమా పూరి తప్ప మరెవరు చేయలేరన్నారు. పూరి  డైరెక్ట్ చేసే విధానం హీరోలతో డైలాగ్స్ చెప్పించే తీరు వేరెవరికి సాధ్యం కాదని 'టెంపర్' సినిమా ఆ విషయాన్ని ప్రూవ్ చేసిందన్నారు. చిరు 150వ చిత్రాన్ని పూరిజగన్నాథ్ తో చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని సలహాలు ఇస్తున్నాడు వర్మ. మరి ఈ విషయం తెలిస్తే మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..!

ram gopal varma
chiranjeevi 150th film
poorijagannath