మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సమంత..!

రీసెంట్ గా ఫుట్ వేర్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి కమిటైన సమంత ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ కు సైన్ చేయనుందని సమాచారం. అదో బనియన్ కంపెనీ అని, ఆ కంపెనీ అఫీషియల్స్ ఆమేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు ఆరుకోట్ల రూపాయలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చిందట. అంతా ఓకే అయితే వచ్చేనెలలోనే షూటింగ్ మొదలవుతుంది. రెండేళ్లకు కాంట్రాక్ట్ ఉండేలా అగ్రిమెంట్ చేసుకోబోతున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ప్రస్తుతం ఆమె అల్లుఅర్జున్ సరసన 'సన్నాఫ్ కృష్ణమూర్తి' చిత్రంలో నటిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న 'మై నేమ్ ఈజ్ రాజు' చిత్రంలో మొదటిసారిగా రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

samantha
footwear company
brand ambassador
ram charan