షమితాబ్ మరో పీకే అవుతుందా!

CineJosh news

బాలీవుడ్ లో 'పీకే' మూవీ తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'షమితాబ్'. ఈ చిత్రం ట్రైలర్స్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్న 'షమితాబ్' పేరే వినిపిస్తోంది. కమల్ హాసన్ చిన్న కూతురు, శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అమితాబ్ బచ్చన్ తో పాటు ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఇళయరాజా ఓ బాలీవుడ్  చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, పి.సి.శ్రీరామ్ సినిమా టోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 3 వేల ధియేటర్లలో రిలీజ్ అవుతోంది. ధనుష్ కు తమిళనాడులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు. గతంలో అమితాబ్ తో 'చిన్నికమ్, పా' చిత్రాలను తీసిన బాల్కీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సాధారణంగా ఒక చిత్రాన్ని ఒక నిర్మాత లేదా ముగ్గురు నలుగురు నిర్మించడం కామన్ అయింది. అయితే ఈ 'షమితాబ్'కు  అమితాబ్, ధనుష్, బాల్కీ, ఏక్తా కపూర్ వంటి 16 మంది నిర్మాతలు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో  వేచిచూడాల్సివుంది...!

shamitabh
amitabh bachchan
dhanush
pk
O.M Review
O.M Review
22 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
22 Nov 2026
DNK Review
DNK Review
22 Nov 2026
GOAT Review
GOAT Review
22 Nov 2026
Scene Review
Scene Review
22 Nov 2026
Ramayana Review
Ramayana Review
22 Nov 2026