కత్రినాను హెచ్చరించిన దీపికా..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ యువహీరో రణభీర్ కపూర్ లు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త విపరీతంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా విరీద్దరూ ఇప్పుడు ఓకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. వీరి ఎంగేజ్మెంట్ కూడా ఇటీవలే లండన్ లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా రణభీర్ కు మాజీ ప్రియురాలైన దీపికాపడుకొనే ఈ విషయమై కత్రినాను హెచ్చరించిందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో కత్రినా, దీపికా ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపికా కత్రినాతో మాట్లాడుతూ.. రణభీర్ మంచివాడు కాదు.. అతనితో జాగ్రత్త.. తొందరపడి పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చిందట. మరి ఎందుకు దీపికా ఆ విధంగా కత్రినాను హెచ్చరించింది? గతంలో రణభీర్ దీపికాను ఏ విషయంలోనైనా మోసం చేశాడా? అనేది బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. అయినా ప్రస్తుతం కత్రినా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని, కాబట్టి దీపికా ఏమిచెప్పినా వినే స్థితిలో ఆమె లేదని అంటున్నారు బాలీవుడ్ జనాలు..!

bollywood hot beauty
katrinakaif
ranbheer kapoor
engagement
london
deepika padukone
hot topic