'గబ్బర్ సింగ్ 2' కి ఏమైంది ?

CineJosh news

'గబ్బర్ సింగ్ 2' ను ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ.. ఈ చిత్రం అనుకున్నప్పటి  నుండి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట్లో ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు అనుకున్నారు. ఆ తర్వాత పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయాడు. ఇటీవల దర్శకుడు మారాడని , దీనికి బాబి దర్శకత్వం వహిస్తాడని అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ను కూడా ఫిక్స్ చేసారు. రెండో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అని కూడా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇదే నెలలో మొదలవుతుందని అన్నారు. కాని ఈ చిత్రం ఇప్పటివరకు మొదలు కాలేదు. 'గోపాల గోపాల' ఫినిషింగ్ స్టేజీ కి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రం పై ఇంకా క్లారిటీ రాలేదు. జనవరి లో మొదలవుతుందని అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్ 2' చిత్రం వచ్చే నెలలో కూడా ప్రారంభమయ్యే అవకాశం  లేదని తెలుస్తుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో అనేక పరిణామాలు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఇప్పటికే పవన్ స్థాపించిన 'జనసేన' పార్టీ కి ఇటీవలే ఎన్నికల సంఘం నుండి గుర్తింపు వచ్చింది . రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ తన సత్తాచాటడానికి రెడీ అవుతున్నాడట. వీటన్నింటి వల్ల  ఈ చిత్రం లేటవుతూ వస్తోందని , ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. 

gabbar singh 2
gopala gopala
pawan kalyan
gabbar singh 2 movie late reason
pawan kalyan busy
janasena
ec recognize janasena
pawan kalyan busy with politics
gabbar singh 2 movie updates
bobby
sampath nandi
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026