తారక్- గురూజీ విషయంలో సందేహాలా?
Rs 700 Cr Gamble: Can Trivikram Convince NTR?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `గాడ్ ఆఫ్ వార్` అనే వర్కింగ్ టైటిల్‌తో పాటు మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` షూటింగ్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో అడుగుపెడతారని భావిస్తున్నారు. తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం - బడ్జెట్ చుట్టూ ఇండస్ట్రీలో ఆసక్తికర సందేహాలు మొదలయ్యాయి.
త్రివిక్రమ్ కెరీర్లో ఇదే తొలి పూర్తిస్థాయి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పాటు 500 కోట్ల నుంచి 700 కోట్ల భారీ బడ్జెట్‌తో తీయాల్సిన కథ ఇది. ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలు, క్లాస్ ఎంటర్టైనర్లతో మెప్పించిన త్రివిక్రమ్‌కు ఇంటెన్స్ యాక్షన్, మైథాలజీ కాన్సెప్ట్‌ను డీల్ చేసిన అనుభవం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోకపోవడం.. భారీ ఆర్థిక రిస్క్ నిర్మాణంలో ఆలస్యం వంటి అంశాలు నిర్మాతల్లో ఆందోళన కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ సినిమాల విషయంలో కథా బలం .. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఏమాత్రం రాజీపడరు. `డ్రాగన్` విడుదల తర్వాత తారక్ పాన్ ఇండియా ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున `గాడ్ ఆఫ్ వార్` స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సిద్ధం చేసే కథ .. అవుట్‌పుట్ పక్కాగా ఉంటేనే ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్లాలని లేనిపక్షంలో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
















































