ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Priyadarshan Says Amitabh Bachchan Is Like God to Him

ఆ డైరెక్ట‌ర్ కి అమితాబ్ బచ్చన్ దేవుడితో సమానం!

Priyadarshan Says Amitabh Bachchan Is Like God to HimPriyadarshan Says Amitabh Bachchan Is Like God to Him

 

ప్రముఖ బాలీవుడ్- సౌత్ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్ నటీనటులకు ఉండే స్టార్‌డమ్గ్లా-మర్ పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నటుల చుట్టూ ఉండే ఆరా ..విభిన్నమైన క్రేజ్ ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు క్రమంగా తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌పై తనకున్న అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ అప్పట్లో నటులను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆరాధించేవారో వివరించారు.

ప్రియదర్శన్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన `కసౌటీ` చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కోసం చేసిన ప్రయత్నంలో తన శరీరానికి పెద్ద గాయమైందని, ఆ మచ్చ ఇప్పటికీ తన వద్ద ఉండిపోయిందన్నారు. `నాకు అమితాబ్ బచ్చన్ దేవుడితో సమానం. ఆయన ఇప్పటికీ నా దృష్టిలో దేవుడే` అని వ్యాఖ్యానించారు. అప్పట్లో నటులను తెరపై చూడటమే  అద్భుతమైన అనుభూతిగా ఉండేదని.. ప్రేక్షకులు సినిమా చూడటానికి కంటే  అభిమాన నటుడిని చూడటానికే థియేటర్లకు వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు.

అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ప్రియదర్శన్ అన్నారు. ప్ర‌స్తుతం ప్రతి నటుడు ప్రతీ చోటా సులభంగా అందుబాటులో ఉంటున్నారని.. నటీనటులు సాధారణంగా తిరగడం వల్ల గతంలో ఉన్నంత అభేద్యమైన ఆకర్షణ ..రహస్య వాతావరణం ఇప్పుడు కొరవడిందని అభిప్రాయపడ్డారు.

Amitabh Bachchan Is God to Me: Priyadarshan