టార్గెట్ కోసం పరుగులు
No Post-Production Plan, Now a Mad Rush to Finish
ఈమధ్యన సెట్ పై ఉన్న పాన్ ఇండియా ఫిలిమ్స్ స్టార్స్ గాయపడి విశ్రాంతి తెకుంటున్నారు. కేవలం పాన్ ఇండియా స్టార్స్ మాత్రమే కాదు.. మిగతా సినిమాల హీరోలు, హీరోయిన్ కూడా సెట్ లో జరిగిన ప్రమాదం బారిన పడి దాదాపుగా రెండు నెలలు విశ్రాంతిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే రిలీజ్ డేట్స్ లాక్ చేసిన సినిమాల షూటింగ్స్ కి బ్రేకులు పడ్డాయి.
నందమూరి బాలకృష్ణ దగ్గర నుంచి ఎన్టీఆర్ వరకు, రామ్ చరణ్ దగ్గర నుంచి రష్మిక వరకు.. పవన్ కూడా కేరళం కు ఆయుర్వేద చికిత్స కోసం వెళ్లారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఇంకా కొత్త సినిమాల సెట్ పైకి వెళ్ళలేదు. సో వారికి వారి సినిమాలకు ఎలాంటి ప్రోబ్లెంస్ లేవు. కానీ బాలయ్య, ఎన్టీఆర్, రష్మిక సినిమాలు సెట్ పై ఉన్నాయి.
విడుదల తేదీలు ప్రకటించారు. దానితో వారు కోలుకుని టార్గెట్ కోసం పరుగులు పెడితేనే కానీ.. లేదంటే ఆ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవాలి. ఇప్పటికే రష్మిక కోలుకుని తిరిగి సెట్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. బాలయ్య కూడా అక్టోబర్ నుంచి సెట్ పైకి వెళ్ళబోతున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ మధ్యనే షోల్డర్ సర్జరీ చేయించుకున్నారు.
బాలయ్య సెట్ లోకి రావడానికి సమయం దగ్గరకు రావడంతో మేకర్స్ డేట్ లాక్ చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఇక ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది జూన్ రిలీజ్ అన్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకుని టార్గెట్ రీచ్ అవ్వాలంటే పరిగెత్తాల్సిందే. చూద్దాం ఈ గాయాల వలన విడుదల తేదీలు మారుతాయో, లేదంటే అనేది.!







































