డిజప్పాయింట్ చేస్తున్న బాలీవుడ్ స్పై థ్రిల్లర్
Disastrous Reviews For Alia Alpha
బాలీవుడ్ ఎన్నో అంచనాల నడుమ నిన్న శుక్రవారం జులై 3న విడుదలైన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్, యష్ రాజ్ ఫిలిమ్స్ భారీగా నిర్మించిన ఆల్ఫా చిత్రానికి ఏమంత పాజిటీవ్ టాక్ వినిపించలేదు. అలియా భట్, శర్వరి లు మెయిన్ లీడ్ గా తెరకెక్కిన ఆల్ఫా చిత్రానికి మొదటిరోజు చెప్పుకోదగిన టాక్ రాలేదు.
యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్స్ లో అత్యంత వీక్ సినిమాగా ఆల్ఫా ను అభివర్ణిస్తున్నారు. వీక్ స్టోరీ, కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా, పాత సీన్లనే మళ్లీ తిప్పి తీసినట్లుగా ఉందంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అలియా భట్ కూడా స్పై పాత్రకు అస్సలు సూట్ కాలేదు అంటున్నారు.
లాజిక్ లేని యాక్షన్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని వీకే అంటున్నారు. అంతేకాకుండా ఓపెనింగ్స్ సీన్స్ ఆడియన్స్ సహనానికి పరిక్ష పెడుతున్నాయి. అలియా భట్ సీత గా, శార్వరి దుర్గ పాత్రల జర్నీ బోరింగ్ గా అనిపిస్తుంది అంటూ ఈ బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా పై ఆడియన్స్ స్పందించడమే కాదు క్రిటిక్స్ కూడా వీక్ రేటింగ్స్ ఇచ్చారు.
















































