వాళ్లిద్ద‌రి మ‌ధ్య అస‌లు గొడ‌వ అదా?

Sudipto Sen hits back at Vipul ShahSudipto Sen hits back at Vipul Shah

  

సంచలన విజయం సాధించిన `ది కేరళ స్టోరీ` చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పటి నుండి  మొదటి భాగం దర్శకుడు సుదీప్తో సేన్ కాకుండా కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వం వహించడం పరిశ్రమలో చర్చనీయాంశమైన సంగ‌తి తెలిసిందే. నిర్మాత విపుల్ షా - దర్శకుడు సుదీప్తో సేన్ మధ్య ఏదో గొడవ జరిగిందని వార్తలు వచ్చినా? ఇన్నాళ్లూ దీనిపై ఎవరూ బహిరంగంగా స్పందించలేదు. అయితే తాజాగా సుదీప్తో సేన్ చేసిన వ్యాఖ్యలతో ఇద్ద‌రి  మధ్య ఉన్న క్రియేటివ్ డిఫరెన్సెస్  బ‌ట్టబయలైంది. కేవలం కేరళకే పరిమితం కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల కథలను కూడా ఇందులో చేర్చాలని నిర్మాత భావించడం సుదీప్తో సేన్‌కు నచ్చలేదని తెలుస్తోంది.

మొదటి భాగం కోసం తాను పదేళ్ల పాటు లోతైన పరిశోధన చేశానని ప్రతి సన్నివేశానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని సుదీప్తో పేర్కొన్నారు. కానీ సీక్వెల్ విషయంలో నిర్మాత ఇతర రాష్ట్రాల అంశాలను కూడా జోడించాలని నిర్ణయించారని కేవలం వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు లేదా వార్తాపత్రికల ఆధారంగా తాను సినిమా తీయలేనని ఆయన తెగేసి చెప్పారు. సరైన పరిశోధన లేకుండా సున్నితమైన అంశాలపై సినిమా తీయడం బాధ్యతారాహిత్యం అవుతుందని భావించే తాను  ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నిర్మాత విపుల్ షా మాత్రం సుదీప్తో రాసిన స్క్రిప్ట్ ఏమాత్రం బాలేదని అందుకే కామాఖ్య నారాయణ సింగ్ కథతో ముందుకు వెళ్లామని గట్టిగా బదులిచ్చారు.

నిజానికి `కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్` చిత్రం ఫిబ్రవరి 27, 2026న విడుదలై మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమా విజ‌య‌మే సాధించ‌లేదు. దర్శకుడు , నిర్మాత మధ్య జరిగిన  మాటల యుద్ధం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సృజనాత్మక స్వేచ్ఛ విషయంలో రాజీ పడకూడదనే సుదీప్తో నిర్ణయం ఒకవైపు, సినిమా పరిధిని పెంచాలనే నిర్మాత ఆలోచన మరోవైపు ఈ వివాదానికి దారితీశాయి. మొత్తానికి విభేదాలతో  సక్సెస్ ఫుల్ కాంబినేషన్ విడిపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయమే.

Vipul Shah reveals why he replaced Sudipto Sen