ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ustaad Bhagat Singh Massive Schedule Begins

ఉస్తాద్ భగత్ సింగ్ మాసీవ్ షెడ్యూల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారి కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన గబ్బర్ సింగ్‌ ను అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ కాంబో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో స్పెషల్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్‌ తో అలరించబోతుంది.

ఈ సినిమా మాసీవ్ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ లెంతీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం భారీ సెట్‌ను నిర్మించారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్ స్టార్  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరస్తున్నారు. 

Ustaad Bhagat Singh Massive Schedule Begins On September 5th

Ustaad Bhagat Singh Massive Schedule Begins
ustaad bhagat singh