మార్చి 15న 's/o స‌త్య‌మూర్తి' ఆడియో

CineJosh news

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రానికి ' s/o స‌త్య‌మూర్తి' టైటిల్ ఖ‌రారు చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ ల పై మూడు పాట‌లు చిత్రీక‌రించి మార్చి 6న యూనిట్ అంతా తిరిగి వ‌చ్చారు. మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ అందించిన ఆడియో మార్చి 15న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎస్.రాధాకృష్ణ మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్‌ ల కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రానికి 's/o స‌త్య‌మూర్తి'  అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము.  ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెర్ ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ పాత్రలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. అందాల భామలు సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా ఇంత‌మంది స్టార్స్ తో క‌ల‌ర్‌ఫుల్ గా వుంటుంది. ఇటీవ‌లే స్పైయిన్ లొ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సమంత‌, నిత్యామీన‌న్ ల పై మూడు పాట‌లు చిత్రీక‌రించి మార్చి 6న యూనిట్ అంతా తిరిగి వ‌చ్చారు. మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్ర‌సాద్ అందిచిన ఆడియో ఈనెల 15 న విడుద‌ల చేస్తున్నాము. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి మా చిత్రం యూనిట్ త‌రుపున హొళి శుభాకాంక్ష‌లు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము.. అని అన్నారు. 

నటీనటులు

అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు

సాంకేతిక వర్గం

ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్  - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ 

son of satyamurthy audio on march 15th
allu arjun
trivikram
devisri prasad
samantha
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026