విడుదలకు సిద్ధమైన 'పంచమి'..!

CineJosh news

అర్చన ఏకపాత్రాభినయంతో 'ఐడియా మూవీ క్రియేషన్స్' పతాకంపై హర్ష మేఘన సమర్పణలో శ్రీకాంత్ నిర్మాతగా, సుజాత బౌరియా దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'పంచమి'. ఈ సినిమా మార్చి 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకురాలు సుజాత బౌరియా మాట్లాడుతూ "ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు మెంబర్స్ చూసి అభినందించి క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చారు. భారతీయ సినీ చరిత్రలో ఇది ఒక వినూత్న ప్రయత్నం. ఈ సినిమా  కోసం నాకు సహకరించిన ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు. అర్చన అభినయం ప్రత్యేకంగా నిలుస్తుంది" అని అన్నారు.

ప్రొడ్యూసర్ డి.శ్రీకాంత్ మాట్లాడుతూ "టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ సినిమా విడుదలకు కొంచెం లేట్ అయినా ప్రేక్షకులు వంద శాతం ఈ సినిమా చూసి త్రుప్తి చెందుతారు. మార్చి 6 న రెండు తెలుగు రాష్ట్రాల్లో 130 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇది ఓ ఎక్స్పెరిమెంటల్ కమ్ కమర్షియల్ సినిమా. గ్రాఫిక్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి" అని అన్నారు.

హీరోయిన్ అర్చన మాట్లాడుతూ "ఫోటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయికి అడవిలో ఎదురయ్యే సంఘటనలను ఎలా ఎదుర్కొని బయటపడిందనేదే కథ. ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే మ్యూజిక్ అధ్బుతంగా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని అన్నారు. 

సంగీత దర్శకుడు శ్రీకోటి మాట్లాడుతూ "ఈ సినిమాలో 6 పాటలు కథకు అనుగుణంగా ఆణిముత్యాలుగా ఉంటాయి. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సినిమాగా చరిత్రలో మిగిలిపోతుంది" అని అన్నారు.

ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్ తేజ, సినిమాటోగ్రఫీ: రఘు ఆర్. భల్లారి, ఎడిటింగ్: కోడెం అజయ్, గ్రాఫిక్స్: రాజేష్ పాల.  

panchami movie
sujatha bouriya
sreekanth
archana
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026