ఫిబ్రవరి27న ‘పిశాచి’

CineJosh news

‘చంద్రకళ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్‌ తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మరో చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. మిస్కిన్‌ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాసు’ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌,బ్యానర్‌పై సి.కళ్యాణ్‌ తెలుగు ‘పిశాచి’గా విడుదల చేస్తున్నారు. నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆశ్వథ్‌, కళ్యాణి నటరాజన్‌ నటీనటులు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదలకు సిద్ధమైంది. 

ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘తమిళ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన ‘పిశాసు’ చిత్రాన్ని తెలుగులో ‘పిశాచి’ పేరుతో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27న 300 థియేటర్లలో ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్స్‌కి, ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల మా బేనర్‌లో రిలీజ్‌ అయిన ‘చంద్రకళ’ చాలా పెద్ద హిట్‌ అయింది. అదే కోవలో ‘పిశాచి’ కూడా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది’’ అన్నారు. 

బాల సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఫిబ్రవరి 27న విడుదలవుతున్న విడుదల కానున్న ‘పిశాచి’ చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆశ్వథ్‌, కళ్యాణి నటరాజన్‌ నటీనటులు. ఈ చిత్రానికి రచన: మిస్కిన్‌, మ్యూజిక్‌: ఆరోల్‌ కొరేళి, కెమెరా: రవిరాయ్‌, నిర్మాతలు: సి.కళ్యాణ్‌, కోనేరు కల్పన, సి.వి.రావు, దర్శకత్వం: మిస్కిన్‌.

telugu movie pisachi
pisachi on feb 27th
c.kalyan
miskyn
pisasu
O.M Review
O.M Review
21 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
21 Nov 2026
DNK Review
DNK Review
21 Nov 2026
GOAT Review
GOAT Review
21 Nov 2026
Scene Review
Scene Review
21 Nov 2026
Ramayana Review
Ramayana Review
21 Nov 2026