ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఆమెతో జతకట్టాలనుంది : రానా

‘దమ్ మారో దమ్’ సినిమాతో బిపాసాతో రొమాన్స్ చేశాడు దగ్గుబాటి రానా. మరొసారి ఆమెతో జతకట్టనున్నాడా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ పడ్నీస్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నియా’(వర్కింగ్ టైటిల్). ఇందులో ఓ కీలక పాత్ర కోసం రానాను, కథానాయికగా బిపాసా బసును ఎంపిక చేశారు. ఈ నెలాఖరు నుండి షూటింగ్ ప్రారంభంకానుంది.
ఇదిలా ఉంటే రానా తనలో ఉన్న మరో బడా కోరికను బయట పెట్టాడు. బాలీవుడ్ అందాల భామ కట్రీనాకైఫ్‌తో కలిసి పని చెయ్యాలనుందని, ఏదొక రోజు తనతో వర్క్ చేస్తానని తన ఆలోచనను ఓ ఇంటర్వ్యూలో బయటుంచాడు దగ్గుబాటి వారసుడు. తన ఆశ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.
rana want to pair with katrina kaif
rana daggubati
bipasa basu
rana paired again with bipasa








































