Advertisement
Google Ads BL

‘పటాస్’, ‘బింబిసార’.. ఇది గమనించారా?


నందమూరి కళ్యాణ్ రామ్‌కి ‘అతనొక్కడే’ సినిమా తర్వాత వచ్చిన హిట్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘పటాస్’ చిత్రమే. ‘అతనొక్కడే’, ‘పటాస్’ చిత్రాల మధ్యలో, అలాగే ‘పటాస్’ తర్వాత ‘బింబిసార’ వచ్చే వరకు అతనికి సరైన హిట్ చిత్రం లేదనే చెప్పుకోవాలి. మధ్యలో కొన్ని చిత్రాలు వచ్చినా.. టాక్‌తో సరిపెట్టుకున్నాయి కానీ.. కలెక్షన్ల పరంగా మాత్రం డిజప్పాయింట్ చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడొచ్చిన ‘బింబిసార’ మాత్రం కళ్యాణ్ రామ్‌కి కొత్త ఊపిరి నిచ్చింది. ఆ విషయం ఆయనే స్వయంగా అంగీకరించారు. ఎందుకంటే, కళ్యాణ్ రామ్ స్టామినా అయిపోయిందని అనుకుంటున్న టైమ్‌లో.. అతనికి ‘బింబిసార’ సాలిడ్ హిట్‌ని ఇవ్వడమే కాకుండా.. మరికొంత కాలం ఆయన సినీ ఆయుష్షును పెంచింది. అయితే ఆయనకి హిట్ వచ్చిన చిత్రాలను గమనిస్తే.. అందులో ఓ సెంటిమెంట్ దాగుందని అర్థమవుతుంది. అదేంటో చూద్దాం.

Advertisement
CJ Advs

ఇది కూడా చదవండి: ‘సీతా రామం’.. లేఖలో ఇన్ని తప్పులా?

‘అతనొక్కడే’ చిత్రంలో స్టార్టింగ్ నుండి.. కొంత మందిని కళ్యాణ్ రామ్ చంపుతూ ఉంటాడు. ప్రేక్షకులకు అసలు విషయం తెలియనంత వరకు అతని పాత్ర నెగిటివ్ షేడ్స్‌లో నడుస్తుంది. అలాగే ‘పటాస్’ సినిమాలో కూడా మొదటి నుండి అతను నెగిటివ్ షేడ్‌లో కనిపిస్తాడు. పోలీస్ డ్రస్ వేసుకుని కూడా విలన్లకు సహకరిస్తుంటాడు. అసలు విషయం తెలిసిన తర్వాత అప్పుడు హీరోయిజం మొదలవుతుంది. తాజాగా వచ్చిన ‘బింబిసార’ చిత్రంలో కూడా కళ్యాణ్ రామ్‌.. స్టార్టింగ్‌లో ఒక రాక్షసుడిగా ప్రవర్తిస్తాడు. ఒకరకంగా ఇది కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రే. సో.. దీనిని బట్టి తెలుస్తుంది ఏమిటంటే.. కళ్యాణ్ రామ్‌ని ముందుగా నెగిటివ్‌గా ప్రొజెక్ట్ చేసి.. తర్వాత హీరోయిజంలోకి దింపితే.. ఆ సినిమా ఖచ్చితంగా హిట్టు. అందుకు ‘పటాస్’, ‘బింబిసార’ చిత్రాలే సాక్ష్యాలు. కాబట్టి కళ్యాణ్ రామ్‌తో సినిమాలు ప్లాన్ చేసేవారు.. ఈ తరహా కాన్సెఫ్ట్స్‌ని వర్కవుట్ చేస్తే బెటరేమో. నిజంగా ఈ సెంటిమెంట్ మరో చిత్రానికి వర్కవుట్ అయితే మాత్రం.. ఇక ‘జగత్ జజ్జరికే’. 

Similarities between Kalyan Ram Patas and Bimbisara:

Hero Kalyan Ram Hit Sentiment Captured
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs