దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై బ్రహ్మాండమైన టాక్‌తో విజయ ధుంధుబి మోగిస్తోంది. ఈ సినిమా మెయిన్ కథాంశం అంతా ఓ లేఖపైనే ఆధారపడి ఉంటుందనే విషయం సినిమా చూసిన అందరికీ తెలుసు. అయితే 20 సంవత్సరాలు గడిచినా కూడా.. ఆ లేఖ చెక్కు చెదరకుండా ఉండటమనే విషయంతో పాటు.. ఆ లేఖలో ఉన్న విషయంలో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లుగా విమర్శకులు తమ రివ్యూలలో విమర్శించారు. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా సక్సెస్‌కు దర్శకుడు హను రాఘవపూడి పొంగిపోయి.. కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖ అంతా తప్పుల తడకలా ఉంది.
ఇది కూడా చదవండి: పోకిరి, జల్సా.. ఇదేం గోలయ్యా!
ఈ లేఖలోని అక్షర దోషాలు.. ఇప్పుడీ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. ఈ లేఖలోని తప్పులను ఎంచుతూ.. ఓ సీనియర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఈ లేఖను షేర్ చేయడంతో.. మరోసారి దర్శకుడు వార్తలలో నిలుస్తున్నారు. ఈ లేఖలో ఉన్న అక్షర దోషాలు గమనిస్తే.. ‘‘మొదలపెట్టాలో, కవి ఆన్నట్టు, హ్రిదయమై, తెలుగ, దృశ్య రూపుం, నిపున్నులు, సీతరామం, సీతరామెం, తీసుకెళ్లరు, అద్భుతనైనా ఊహిచుకోవడానికి, కేవలెం, అడిగిందాల, అందరికి న ధన్యవాదాలు’’. ఇవి ఈ లేఖలో ఉన్న అక్షర దోషాలు. సినిమాలో ఉన్న లేఖకే కొందరు తలబద్దలు కొట్టుకుంటుంటే.. దర్శకుడు హను రాఘవపూడి కృతజ్ఞతలు తెలుపుతూ విడుదల చేసిన ఈ లేఖ మరింత గందరగోళంగా ఉండటం గమనార్హం.