Advertisement
Google Ads BL

సినీజోష్ సలహ.. దిల్ రాజు ఆచరణ..


కరోనా సెకండ్ వేవ్ తో క్లోజ్ అయిన థియేటర్స్ జులై 23 న 100 శాతం సీటింగ్ తో తెరుచుకున్నాయి. కానీ ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ తో రన్ అవుతున్నా టాలీవుడ్ యంగ్ హీరోలు డేరింగ్ గా తమ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. జులై 30 న సత్యదేవ్ తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ మూవీలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సెకండ్ వేవ్ తగ్గి ప్రేక్షకుల స్పందన, తెలియకుండానే యంగ్ హీరోస్ చాలా ధైర్యంతో రిలీజ్ డేట్స్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో సినిమా పరిశ్రమ మళ్ళీ గాడిన పడాలి అంటే సెలబ్రిటీస్, సినిమా పెద్దలు థియేటర్స్ మీద అవగాహన కలిపించి ప్రేక్షకుల్లో భయం పోగొడితే.. ప్రేక్షకులు సినిమా థియేటర్స్ క్యూ కడతారనే విషయాన్నీ సినీజోష్ ఎప్పుడో ప్రస్తావించింది. 

Advertisement
CJ Advs

సెలబ్రిటీస్ ముందుకు వచ్చి థియేటర్స్ విజిట్ చేసి థియేటర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించడమే కాదు, కరోనా తో ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలు తొలగిస్తే.. ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారని సలహా ఇచ్చింది సినీజోష్. 

సినీజోష్ సలహాని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాటించారు. ఆయన ఈ రోజు జరిగిన ఇష్క్ మూవీ ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో పాల్గొని ప్రేక్షకులు థియేటర్స్ కి రావాలి.. అప్పుడే సినిమా పరిశ్రమ చక్కబడుతుంది అని అన్నారు. తేజ సజ్జ - ప్రియా ప్రకాష్ వారియర్ కాంబోలో జులై 30 న విడుదల కాబోతున్న ఇష్క్ సినిమా ప్రెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు.. తాను ఈ సినిమా ప్రెస్ మీట్ కి వచ్చింది.. థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి.. ప్రేక్షకులు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా థియేటర్స్ రావాలి అని చెప్పడానికే అంటూ ఆయన ఇష్క్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మరి ఇలా ఇండస్ట్రీ పెద్దలు థియేటర్స్ విషయంలో ప్రేక్షకుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి ముందు రావాల్సి ఉంది. 

Click Here: థియేటర్స్ ఓపెన్.. కానీ

Dil raju follows cinejosh suggestion about theaters:

Dil raju speech at ishq movie Pressmeet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs