కరోనా పాండమిక్ సిట్యువేషన్ తో మూవీ థియేటర్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. కరోనా తో లాక్ డౌన్ వలన థియేటర్స్ బోసి పోయాయి. గత ఏడాది ఏకంగా తొమ్మిది నెలలు మూతబడిన థియేటర్స్ ఈ ఏడాది మూడు నెలలు మూతబడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు నడుస్తుండడంతో.. థియేటర్స్ పాక్షికంగానే ఓపెన్ అయ్యాయి. ఏపీ లాంటి రాష్ట్రాల్లో 50 పర్సెంట్ అక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. కానీ తెలంగాణాలో నేటి నుండి 100 శాతం సీటింగ్ తో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి.
మరి థియేటర్స్ ఓపెన్ అయ్యాక మంచి సినిమా రిలీజ్ లు ఎమన్నా ఉన్నాయా అంటే లేదు. ఈ వారం ఆహా అనిపించే సినిమాలేవీ థియేటర్స్ లోకి రావడం లేదు. ఇక జులై 30 నుండి సినిమాల హంగామా మొదలవుతుంది. ఈలోపులో కాస్త సెలబ్రిటీస్ థియేటర్స్ విసిట్ చేసి ప్రేక్షకులకి థియేటర్స్ మీద భయం పోయేలా చేస్తే బావుంటుంది. కానీ సురేష్ బాబు లాంటి వారు ఇలాంటి కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో నా ఫ్యామిలీని నేను థియేటర్స్ కి పంపను, ఏపీలో థియేటర్స్ ఓపెన్ చెయ్యను అంటూ స్టేట్మెంట్స్ ఇస్తే.. ప్రేక్షకులు భయపడిపోవడం ఖాయం. మరి ఈ రోజు నుండి తెలంగాణ థియేటర్స్ ఓపెన్ అయినా.. బాక్సాఫీసు సందడి చూసేది జులై 30 నుండే. మరి ప్రేక్షకులు ఏ మాత్రం థియేటర్స్ కి వస్తారో చూడాలి.