Advertisement
Google Ads BL

పూరి 'జనగణమన' హీరో మారినట్లేనా..!


డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ బాబుతో ఒక పవర్ ఫుల్ కథతో  సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇందుకోసం 'జనగణమన' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన 'పోకిరి, బిజినెస్‌మేన్' సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక మహేష్ తో తీసే 3 వ సినిమాతో కూడా హిట్ కొట్టాలని మాంచి కసితో వున్న పూరి 'జనగణమన' టైటిల్ తో ఒక పవర్ఫుల్ స్టోరీ ని రెడీ చేసుకున్నాడు. ఇక వీరిద్దరి సినిమా కూడా ఫైనల్ అయ్యిందని అనుకున్నారు. అయితే మహేష్ మాత్రం మురుగదాస్ సినిమా కంప్లీట్ అయ్యాక కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. మరి మురుగదాస్ సినిమా తర్వాత మహేష్, పూరి కాంబినేషన్ లో నటిస్తాడనుకుంటున్న టైం లో కొరటాలతో సినిమాని ఒప్పుకుని పూరి ని సైడ్ చేసేసాడు మహేష్. పోనీ కొరటాల కాంబినేషన్ లో సినిమా పూర్తయ్యాకన్నా మహేష్ ఖాళీ అవుతాడు అనుకుంటే మళ్ళీ వంశీ పైడిపల్లి తో మరో సినిమాలో మహేష్ నటించనున్నాడని ప్రచారం జరుగుతుంది. 

Advertisement
CJ Advs

ఇక ఇన్ని రోజులు పూరి వెయిట్ చెయ్యలేక 'జనగణమన' కథతో మరో హీరో తో సినిమా చెయ్యడానికి డిసైడ్ అయ్యాడని అంటున్నారు. ఇక ఈ స్టోరీ ఎన్టీఆర్ కి అయినా బానే ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ తో 'జనగణమన' కథని తెరకెక్కించడానికి పూరి ప్లాన్ చేస్తున్నాడని ఇప్పుడొక న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మరి ఇప్పటికే పూరి ఒక హీరోకి కథ రాసి మరో హీరోతో ఆ కథని తీసి చాల సినిమాలే హిట్ కొట్టాడు. అందుకే ఇప్పుడు మహేష్ కి రాసిన కథతో ఎన్టీఆర్ని డైరెక్ట్ చెయ్యాలని పూరి చూస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

మరి ఎన్టీఆర్ ఏమో ఇప్పటివరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పై క్లారిటీ లేకుండా వున్నాడు. పూరితో కూడా అతను కమిట్ అవ్వలేదు. పూరితో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందన్న టైం లో తన అన్న కళ్యాణ్ రామ్.. పూరి డైరెక్షన్ లో నటించిన 'ఇజం' చిత్రం విడుదలయ్యాక ఫైనల్ చేద్దామనుకుంటున్నాడని అన్నారు. మరి 'ఇజం' సినిమా విడుదలైంది. టాక్ ఆశించినంతగా అయితే లేదు. మరి 'ఇజం' రిజల్ట్ చూశాక పూరి డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి ఇప్పుడు ఎన్టీఆర్ ముందుకు వస్తాడా అన్నది మాత్రం సందేహమే. అంటే పూరి 'జనగణమన' కథ కోసం మరో హీరోని వెతుక్కోవాలేమో?

Click Here for Ism Review

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs