Power Star Pawan Kalyan's political party 'Janasena' is celebrating its first anniversary today. Without making much noise on this occasion, Pawan Kalyan takes his twitter page to reveal the wish of Jansena. He was worried with the sufferers who are losing their lands due to the government's 'development' acts. According to Pawan Kalyan development should be done only after proper shelters are provided for the victims. His tweets are as follow.
* 'జనసేన'పార్టీ అండగా నిలబడ్డ కార్యకర్తలకి,అభిమానులుకి, అక్కచెల్లెల్లకి,ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..'ఊళ్లు కోసం రోడ్లు వెయ్యడం చూసాం గాని , రోడ్లు కోసం ఊళ్లు తీసెయ్యటం చూళ్ళేదు సారూ!' - రింగు రోడ్డు లో భూమి కోల్పోయిన పేద నిర్వాసితుడు. అభివృద్ధి అనేది సామాన్యుడిని భాగస్వామి చేసేలా ఉండాలి కాని భయపెట్టేల చెయ్యకూడదు. అప్పటి హిరాకుడ్ నుంచి ఇప్పటి పోలవరం దాక , అభివృద్ధి ప్రాజెక్టలు వల్లన సామాన్యులు, ఆదివాసీలు నిర్వసితులుగానే మిగిలిపోయారు. ప్రాజెక్ట్లులు ప్రారంభించటం లో ఉన్న ఉత్సాహం ,పునరావాసం కల్పించటం లో ఏ ప్రభుత్వం చూపలేదు. మానవీయ కోణం తో కూడిన అభివృద్దే 'జనసేన' ఆకాంక్ష! జైహింద్.