రష్మిక మందన్న ఆడవాళ్లు మీకు జోహార్లు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...
- ఫస్ట్ లాక్ డౌన్ టైమ్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్క్రిప్టును దర్శకుడు కిషోర్ తిరుమల చెప్పారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో ఇంత మంది లేడీస్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో ఎవరు నటిస్తారనే ఉత్సుకతనే మొదట కలిగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఒకటి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది.
- ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆద్య. ఆమె ముక్కుసూటి మనిషి. మొహమాటంగా ఉండదు. అనుకున్నది చెప్పేస్తుంది. మనసులో ఏదో దాచుకుని డ్రామా క్రియేట్ చేయడం ఇష్టముండదు.
- దర్శకుడు కిషోర్ తిరుమలతో పనిచేయడం చాలా సరదాగా ఉండేది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. మాల వేసుకునేవారు. ఏం కోరుకున్నారు సార్ అని అడిగితే.. ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కదా అన్నీ సవ్యంగా జరగాలని కోరుకున్నా అని నవ్వుతూ చెప్పేవారు.
- శర్వానంద్ తో కలిసి నటించడం హ్యాపీ. నేను పుష్ప సెట్ లో నుంచి ఆడవాళ్లు.. షూట్ కు వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అయ్యేదాన్ని. అక్కడ అడవుల్లో షూటింగ్ చేసి ఇక్కడికొస్తే పిక్నిక్ లా అనిపించేది. ఇంటి నుంచి శర్వా ఫుడ్ తెచ్చి పెట్టేవాడు. ఒక ఫ్యామిలీలా అంతా కలిసి ట్రావెల్ చేశాం.
- ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభవం. నేను ఉన్నందుకే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని ఖుష్బూ గారు అనడం నామీదున్న ప్రేమతోనే.
- ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కీర్తి, సాయిపల్లవి ఉండటం ఎంతో హ్యాపీ అనిపించింది. వాళ్లను చూస్తుంటే మహిళా శక్తిని చూసినట్లు ఉంది.