సందడిగా సాగిన ఆహా సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్ టైనర్ మారుతి ఈవెంట్
Click Here 👉 Aha Celebrating Maruti Event Photos
సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ఆహాకు మారుతి లాంటి ఆడియెన్స్ పల్స్ తెల్సిన డైరెక్టర్ తోడైతే ఎలాంటి విజయాలు వస్తాయో మంచి రోజులు వచ్చాయి, 3 రోజెస్ ప్రాజెక్ట్స్ నిరూపించాయి. ఈ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ నేపథ్యంలో సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్ టైనర్ మారుతి ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మారుతి, హీరో సంతోష్ శోభన్, ఆహా సీయీవో అజిత్ ఠాకూర్, హీరోయిన్ ఈషా రెబ్బ, నిర్మాత ఎస్ కే ఎన్, హీరోయిన్ పూర్ణ, నటి హేమ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ.. కరోనా టైమ్ లో ఇంట్లో ఉండి రేపు మన పరిస్థితి ఎలా అనుకున్న చాలా మంది నటీనటులకు పని కల్పించారు మారుతి అన్న. మనకేం ఫర్వాలేదనే ధైర్యాన్ని ఇచ్చారు. కరోనా టైమ్ లో మంచి రోజులు వచ్చాయి సినిమాను రూపొందించి ఇండస్ట్రీకి కూడా ధైర్యాన్ని ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో చాలా మంది అడిగేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని సినిమా చేస్తున్నారు అని. అలాంటి పరిస్థితుల్లో సక్సెస్ ఫుల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. త్వరలో కొత్త మారుతి గారిని చూస్తారు అన్నారు.
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. దీవాళికి రిలీజైన మంచి రోజులు వచ్చాయి సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ సినిమా చూడండి. మంచి రోజులు వచ్చాయి సినిమాతో మారుతి గారు ఒక గుడ్ ఫ్రెండ్ అయ్యారు. ఆయన గ్రేట్ టెక్నీషన్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా. ఈ సినిమాలో పాటల్ హిట్ అవుతాయి అని మేం నమ్మాం. అలాగే సోసో గా పాట 20 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది అన్నారు.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. అనేక కోరికలతో, ఆశలతో ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. అలాంటి వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న గ్రేట్ ప్లాట్ ఫామ్ ఆహా. మారుతి అన్నతో పనిచేసే అవకాశం నా కెరీర్ లో చాలా త్వరగా రావడం అదృష్టంగా భావిస్తుంటాను. ఆయనతో మళ్లీ మళ్లీ పనిచేసేందుకు వెయిట్ చేస్తున్నాను. మంచి రోజులు వచ్చాయి సినిమా నాకొక లర్నింగ్ ఎక్సీపిరియన్స్. మా సినిమాకు బెస్ట్ టీమ్ కుదిరింది అన్నారు.
త్రీ రోజెస్ వెబ్ సిరీస్ దర్శకుడు మ్యాగీ మాట్లాడుతూ.. మనసులో ఉన్న విషయాల్ని బయటకు చెప్పుకోలేకపోయిన చాలా మంది అమ్మాయిలు త్రీ రోజెస్ వెబ్ సిరీస్ చూశాక ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. మారుతి గారి వల్లే ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఈషా రెబ్బ్, పాయల్ రాజ్ పుత్, పూర్ణను హ్యాండిల్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది అన్నారు.
నటి హేమ మాట్లాడుతూ.. త్రీ రోజెస్ వెబ్ సిరీస్ లో నేను ఇన్నోసెంట్ మదర్ క్యారెక్టర్ లో నటించాను. చాలా రోజుల తర్వాత నాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరికింది. షూటింగ్ అంతా ఎంజాయ్ చేశాం. ఇది వెబ్ సిరీస్ అయినా, నాకైతే సినిమా చేసిన ఫీలింగే కలిగింది. ముగ్గురు హీరోయిన్స్ పూర్ణ, పాయల్, ఈషా చక్కగా నటించారు అన్నారు.
హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ.. మనం సినిమాలు చేసినప్పుడు రిజల్ట్ ఫస్ట్ షోకు తెలిసిపోతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సందేహించాను. 3 రోజెస్ వెబ్ సిరీస్ ను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూస్తున్నారు. తెలుగు ఓటీటీ ఆహా ఉండటం వల్లే మనకు ఎక్స్ క్లూజివ్ తెలుగు వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇతర భాషలకు కూడా ఆహాను విస్తరిస్తున్నట్లు తెలిసింది. ఆల్ ద బెస్ట్ టు ద ఆహా టీమ్. ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా మారుతి గారి సినిమాల్లో హీరోయిన్స్ కు బలమైన క్యారెక్టర్స్ ఇస్తారు. ఆయన ప్రాజెక్ట్ లో నటించడం ఇది నాకు రెండోసారి. బ్రాండ్ బాబు తర్వాత 3 రోజెస్ తో మంచి సక్సెస్ ఇచ్చారు అన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. 3 రోజెస్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయినప్పుడు చాలా మంది ఇందులో ఏముంటుంది, ముగ్గురు అమ్మాయిల షో అనుకున్నారు. కానీ మారుతి గారు ఈ ప్రాజెక్ట్ కు ఒక వ్యాల్యూ తీసుకొచ్చేలా గైడ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో నాకంటే పదేళ్ల చిన్నవాడైన బాయ్ ఫ్రెండ్ దొరికాడు. దర్శకుడు మ్యాగీ, రైటర్ రవి ఇద్దరూ ఫెంటాస్టిక్ పర్సన్స్. షూటింగ్ లేకపోయినా అంతా సరదాగా మాట్లాడుకునేవాళ్లం. ఈ టీమ్ తో పనిచేయడం చాలా పాజిటివ్ గా అనిపించింది అన్నారు.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. గతంలో ఓటీటీలో మన వాళ్లు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే ముంబైకి, విదేశాలకు మెయిల్స్ పెట్టి అది అప్రూవ్ అయ్యే వరకు చాలా రోజులు వేచి చూసేవారు. కానీ ఆహా వచ్చాక, ఒక్క పోన్ కాల్ తో వారం రోజుల టైమ్ లో ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతోంది. ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్, నటీనటులకు ఆహా సపోర్ట్ చేస్తోంది. మంచి రోజులు వచ్చాయి, త్రీ రోజెస్ సక్సెస్ ఈవెంట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఆహా ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు మారుతి నేనూ సినిమాల్లోకి రాకముందు నుంచీ స్నేహితులం. తెలుగు తెరపై ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసి మారుతి తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు. ఆయన స్నేహితుడు అవడం గర్వంగా ఉంది అన్నారు.
ఆహా సీయీవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. 3 రోజెస్ ఆహా ఓటీటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అయినందుకు టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నాను. మంచి రోజులు వచ్చాయి లాంఛ్, 3 రోజెస్ సక్సెస్ కలిపి సెలబ్రేటింగ్ మాస్ ఎంటర్ టైనర్ మారుతి అనే ఈవెంట్ చేస్తున్నాం. అతి తక్కువ టైమ్ లో అప్రూవ్ అయిన వెబ్ సిరీస్ ఇది. వచ్చే ఏడాది 3 రోజెస్ కు సెకండ్ పార్ట్ చేయాలని ప్లాన్ ఉంది. అలాగే మారుతి గారి దగ్గర నుంచి ఇంకో ప్రాజెక్ట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. నా కోసం మాస్ ఎంటర్ టైనర్ అనే ప్రోగ్రాం పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. కానీ నేనేంటో నేనేం చేయగలనో ఎప్పుడూ మర్చిపోను. ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అఖండ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. రాబోయో సినిమాలకు కూడా ఇదే ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి టైమ్ లో రిలీజ్ చేసినప్పుడు థియేటర్ ఎక్సీపిరియన్స్ కోరుకున్న వాళ్లు థియేటర్ కు వెళ్లారు ఓటీటీ కోసం వేచి చూసేవారు ఆగారు. ఇప్పుడు ఆహాలో మంచి రోజులు వచ్చాయి స్ట్రీమింగ్ మొదలవగానే చూడని వాళ్లంతా చూస్తున్నారు. మాకైతే సినిమా చేసిన రోజులన్నీ మళ్లీ రీకాల్ అయ్యాయి. ఆహా లాంటి ప్లాట్ ఫామ్స్ వల్ల సినిమా పెరుగుతోంది. ఆహాను నిలబెట్టేందుకు టీమ్ అంతా ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. అందుకే ప్రతి ఒక్క తెలుగు వారు ఇది మన ఓటీటీ అని భావించండి, యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. నెక్ట్ ఇయర్ ఇంకో ప్రోగ్రాం ఆహాకు చేస్తాను అన్నారు.