యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.
డైరెక్టర్ శ్రీను మాట్లాడుతూ.. అంతా సరదగా ఉన్నాం కానీ లోపల షేక్ అవుతున్నానుం. ఇది మంచి ఫ్యామిలీ కమర్షియల్ సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. మీతో కచ్చితంగా ఎమోషన్‌ను తీసుకెళ్తారు. రామ్ చరణ్, నాగ చైతన్య, నాగార్జున, పూజా హెగ్డే ఇలా అందరికీ థ్యాంక్స్. మా సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ చిత్రంతో మా అందరికీ సక్సెస్ రావాలి. మా నిర్మాత సుప్రియ మేడంకు థ్యాంక్స్. మిమ్మల్ని కలిసి ఉండకపోతే ఎంతో కోల్పోయేవాడిని. సినిమా పరంగానే కాకుండా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్స్ అనే పదం సరిపోదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. సక్సెస్ మీట్‌కు నాగార్జున గారు ముఖ్య అతిథిగా రావాలి అని అన్నారు.
సుప్రియ మాట్లాడుతూ.. శ్రీను వచ్చి కథ చెప్పాడు. బాగా నవ్వాను. ఇంత నవ్వించాడు కదా? సినిమా తీయాలని అనుకున్నాను. నాగార్జున, నాగ చైతన్యలకు వినిపించాను. తీయాలని అనుకున్నాం. కానీ కరోనా వచ్చి పడింది. సినిమా తీయాలా? అని అనుకున్నాం. కానీ మళ్లీ శ్రీను వచ్చాడు. ఏడాదికి ఒక్క సినిమా అది చిన్నదైనా పెద్దదైనా తీయాలని అనుకున్నాం. ఓ చిన్న సినిమాకు అన్నపూర్ణ బ్యాక్ ఎండ్‌లో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో అని మీరు నిరూపించారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయల పని చేశారు. ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఈ స్లాంగ్, ఈ కారెక్టర్ కోసం రాజ్ తరుణ్ గుర్తుకు వచ్చాడు. ఈ సినిమా చేస్తావా? అని నేనే అడిగాను. పక్కన మీకు నచ్చిన వాళ్లను పెట్టుకోండి. ఓ రెండున్నర గంటలపాటు సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి వచ్చి..అన్నపూర్ణ స్టూడియోలో మూడు సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్న వారెవ్వరికీ థ్యాంక్స్ చెప్పాలని లేదు. థ్యాంక్స్ చెబితే జర్నీ ఇక్కడితోనే ఆగిపోద్దేమోననిపిస్తోంది. థ్యాంక్స్ చెప్పాలంటే భయం వేస్తోంది. కశిష్ ఖాన్ సినిమా కోసం చాలా కష్టపడింది. తెలుగు రాకపోయినా కూడా నేర్చుకుని ప్రాంప్టింగ్ చెప్పుకుంది. సినిమాలో భీమవరంలో పాత్ర, సిటీలోని సెక్యూరిటీ గార్డ్ ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. క్లాస్‌లు పీకినట్టుగా కాకుండా అండర్ లైన్‌గా మెసెజ్‌లుంటాయి. సినిమా ఆసాంతం వినోదభరితంగానే ఉంటుంది. ట్రైలర్, పాటలు అన్నింటికి మంచి స్పందన వచ్చింది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు. భీమవరంలో ప్రీమియర్స్ వేస్తున్నాం. అందరూ థియేటర్లోనే సినిమాను చూడండి. పైరసినీ ఎంకరేజ్ చేయకండి అని అన్నారు.
చోటా కే ప్రసాద్ మాట్లాడుతూ.. నవంబర్ 26న ఈ చిత్రం విడుదలవుతోంది. మా అందరి కంటే ఎక్కువగా డైరెక్టర్ శ్రీనుకు ఈ చిత్రం ఇంపార్టెంట్. ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. రేపు మేం కొట్టబోతోన్నామని అన్నారు.
హీరోయిన్ కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. ముందుగా సుప్రియ మేడంకు థ్యాంక్స్. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా కథ అందంగా ఉంటుంది. షూటింగ్ చేసే సమయంలోనే మాకు ఈ చిత్రం హిట్ అవుతుందని నమ్మకం ఉన్నాం. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇది నా మొదటి సినిమా. థియేటర్లో తప్పకుండా చూడండి అని అన్నారు.