Advertisementt

రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ పాదురి ఇంట‌ర్వ్యూ

Mon 25th Oct 2021 10:37 AM
anil paduri,anil paduri interview,anil paduri interview new,romantic music director  రొమాంటిక్  డైరెక్టర్ అనిల్ పాదురి ఇంట‌ర్వ్యూ
Anil Paduri Interview రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ పాదురి ఇంట‌ర్వ్యూ
Advertisement
Ads by CJ

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం డైరెక్టర్ అనిల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

మాది పాలకొల్లు, నర్సాపురం. ఇంజనీరింగ్  చేసినా కూడా ఆర్ట్ మీద ఉన్న ఆసక్తితో ఇటు వైపు వచ్చాను. వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశాను. కళ్యాణ్ రామ్ గారితో కలిసి నేను ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీ ప్రారంభించాను. తారక్ గారితో టెంపర్ సినిమాను చేశాను. ఆ సమయంలోనే  పూరి గారితో  పరిచయం ఏర్పడింది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది.

పూరి గారు ఆయనతో పాటు రైటింగ్‌కు నన్ను తీసుకెళ్లేవారు. ఇజం సినిమా సమయంలోనే పూరి గారు నన్ను వేరే కథను డైరెక్ట్ చేయమన్నారు. కానీ అప్పుడు నా మీద నాకు అంతగా నమ్మకం లేదు. నేను రాసేవి కూడా పూరి గారికి నచ్చేవి. అలా నా మీద నమ్మకంతోనే మళ్లీ రొమాంటిక్ సినిమా కథను ఇచ్చారు. ఈ కథ కూడా నాకు బాగా నచ్చింది. అందుకే డైరెక్షన్ చేసేందుకు ఒప్పుకున్నాను. దర్శకుడు అవ్వాలనే ఆలోచను రేకెత్తించింది పూరి గారే.

సొంత కథలు రాయగలవు.. రాసుకో అని పూరి గారు అన్నారు. ఎవరినైనా నువ్ ఒప్పించగలవ్ అని ధైర్యాన్ని ఇచ్చారు. కానీ నేను పూర్తి స్థాయిలో కథను సిద్దంచేయలేదు. లైన్స్ మాత్రమే అనుకున్నాను. అదే సమయంలో పూరి గారు రొమాంటిక్ కథను ఇచ్చారు. ఆ కథతో నేను  కూడా ట్రావెల్ చేశాను. నాకు ఎంతో నచ్చిన కథ కావడంతో దర్శకత్వం చేశాను.

మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథే రొమాంటిక్. ఇందులో మంచి ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ట్రైలర్‌లో ఎక్కువగా రొమాన్స్ ఉంది కదా?అని సినిమా అంత అలానే ఉంటుందని కాదు. ఇది కేవలం యూత్ సినిమానే కాదు.. ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటుంది.

పూరి గారు రాసిన కథ, ఆయన అందించిన మాటలే అయినా కూడా నా మార్క్ కనిపిస్తుంది. నా కోణంలోంచే సినిమాను తీశాను. కానీ కచ్చితంగా ఆయన ప్రభావం, మార్క్ ఉంది. అయితే సినిమా చూస్తే మాత్రం అది వేరే వాళ్లు తీసిన దానిలానే అనిపిస్తుంది. పూరి సినిమాలా అనిపించదు.

సినిమాను నువ్వు  చేయగలవు.. నువ్వు చేస్తే కొత్త ఫ్లేవర్ వస్తుందని పూరి గారు అన్నారు. ఆకాష్‌కు కూడా చెప్పారా? అని అడిగాను. చెప్పాను అని అన్నారు. అలా సినిమా మొదలైంది.

ప్రస్తుతం ఆకర్షణనే ప్రేమ అని అనుకుంటున్నారు. అందుకే కొద్ది కాలానికే విడిపోతోన్నారు. ప్రేమ, ఆకర్షణకు మధ్య ఉన్న సన్నని గీత గురించి ఇందులో వివరించాం. ప్రేమను  నమ్మని ఓ కుర్రాడు.. ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ.

ఈ క‌థ‌కు ఆకాష్ కరెక్ట్‌గా సరిపోయారు.  పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. రేపు ప్రేక్షకులు కూడా అదే అంటారు.

మామూలుగా అయితే నేను  మొదట యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లోనే చేయాలి. ఇజం సినిమా సమయంలోనే పూరి గారు అన్నారు. కానీ వీఎఫెఎక్స్ పనులతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. నేను నెక్ట్స్ యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లోనే చేస్తున్నాను.

ఈ సినిమా ఆకాష్ వాయిస్‌కు, విజువల్స్‌కు  మ్యాచ్ అయ్యాయి. ఆకాష్ టైమింగ్‌ను పట్టుకున్నాను.  పూరి జగన్నాథ్ గారి డీఎన్ఏ కాబట్టి ఆకాష్ డైలాగ్స్ చెబుతుంటే ఆయన చెప్పినట్టు ఉంటుంది.

హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో ఇన్ స్టాగ్రాంలో కేతిక శర్మ ప్రొఫైల్ పూరి గారు చూశారు. ఆమెను ఓకే చెప్పేశాం. అయితే కెమెరాల ముందు నటించడం ఆమెకు తెలీకపోవడంతో చాలా వర్క్ షాప్స్ పెట్టాం. ఆ తరువాత సినిమాలోకి తీసుకున్నాం.

ఫైనల్ కట్ అయ్యాక ఈ చిత్రాన్ని పూరి గారికి చూపించాను. లేచి వెళ్లిపోయారు. నడుచుకుంటూ వచ్చి కళ్ల నీళ్లు పెట్టేసుకున్నారు. నా సినిమాలో ఇంత ఎమోషన్ ఎక్కడుందా? అని అనుకున్నాను. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో అంత ఎమోషన్ ఉంది. ఇందులో అంత కంటే ఎక్కువగా ఉంది. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మంచి సినిమా తీశావ్ అని మెచ్చుకున్నారు.

ఆకాష్ కెరీర్‌కు రొమాంటిక్ చిత్రం బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. డైలాగ్స్, ఆ మాడ్యులేషన్, విజువల్స్ పరంగా కొత్తగా కనిపిస్తాడు. చాలా ఈజ్ కనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకా ఓపెన్ అయ్యాడు. 

నా రెండో సినిమాకు సంబంధించిన కథ ఇంకా సిద్దం కాలేదు. కానీ కమర్షియల్ సినిమాలంటే నాకు ఇష్టం. అలాంటి మూవినే తీస్తాను. నాకు వీఎఫ్ఎక్స్‌లో పట్టు ఉంది కదా? అని కథకు అవసరం లేకపోయినా ఇరికించను. కథను బట్టి వీఎఫెఎక్స్ చేయాల్సి ఉంటుంది. సినిమా ఓ గ్రాండ్ స్కేల్‌లో చూపించాలంటే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు తీయాలంటే కచ్చితంగా వీఎఫ్ఎక్స్ వాడాల్సిందే. నేను రాజమౌళి, త్రివిక్రమ్, కరుణాకరన్, బోయపాటి శ్రీను వంటి దర్శకుల సినిమాలకు వీఎఫెఎక్స్ చేశాను.

రమ్యకృష్ణ రావడంతో  మా సినిమా లుక్ మారిపోయింది. ఆమె స్థాయికి తగ్గ పాత్ర. ఆమె ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. 

ఓటీటీ ఆఫర్లు వచ్చినా కూడా రిజెక్ట్ చేశారు. థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్అయ్యారు. అలా థియేటర్‌లోనే సినిమాను విడుదల చేస్తున్నందుకు పూరి, ఛార్మీలకు థ్యాంక్స్. అదే నాకు గొప్ప విషయం.

సినిమా మొత్తం చూశాక సెన్సార్ సభ్యులు వెంటనే యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ముందు రిలీజైన ఓ పాటను చూసిన సెన్సార్ ఇవ్వడానికి చాలా  టైం పడుతుందని, ఎక్కువ కట్స్ చెప్పాల్సి ఉంటుందని అనుకున్నారు. కానీ సినిమా చూసిన వెంటనే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏడిపించారు కదా? అని అన్నారు. రేపు సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలానే ఫీలవుతారని నా నమ్మకం

Anil Paduri Interview:

Anil Paduri Interview news