Advertisementt

డైరెక్టర్ సంపత్ నంది ఇంటర్వ్యూ

Sat 11th Sep 2021 08:30 PM
director sampath nandi,sampath nandi interview,seetimaarr movie  డైరెక్టర్ సంపత్ నంది ఇంటర్వ్యూ
Director Sampath Nandi Interview డైరెక్టర్ సంపత్ నంది ఇంటర్వ్యూ
Advertisement
Ads by CJ

హీరో గోపీచంద్‌, ఆయ‌న అభిమానులు సంతోషపడేలా సీటీమార్ సినిమా తీసినందుకు ద‌ర్శ‌కుడిగా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను:  డైరెక్ట‌ర్ సంప‌త్ నంది

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌లై విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఇంట‌ర్వ్యూ విశేషాలు...

* యూనానిమస్ రెస్పాన్స్ వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు ప‌డ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

* బాలీవుడ్‌లోని సినిమాల‌తో క‌లిపి పోల్చి చూసి ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమా అని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అవి నిర్మాత‌లు తెలియ‌జేస్తారు.

* ముందు నుంచి మాస్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ క‌థ అనుకున్న త‌ర్వాత దాన్ని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చేద్దామ‌ని అనుకున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్ష‌న్ సినిమా చేశాన‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చెప్పాను. యాక్ష‌న్ మూవీ చేయ‌డానిక‌నే ఆ బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నాను. దానికి ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్‌, వాళ్లు ఓ ఉద్దేశం కోసం పోరాడ‌టం.. వంటి ఎమోష‌న్స్‌కు అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. ప్రీతి అస్రాని చేసిన విన్నింగ్ షాట్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ గురించి, అందులోని యాక్ష‌న్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. 

*గౌత‌మ్ నంద త‌ర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనో, రివేంజ్ ఫార్మేట్‌లోనో సినిమా చేయాల‌నుకున్నాను. అలాంటి స‌మ‌యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్  కాన్సెప్ట్ ఐడియాకు వ‌చ్చింది.  క‌బ‌డ్డీ ఇండియాలో పెద్ద మాస్ గేమ్‌. అలాంటి మాస్ గేమ్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడిస్తే బావుంటుంద‌నిపించింది. అందుకే ఈ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుకున్నాను. 

* బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత అంత మంచి డైలాగ్స్ ఈ సినిమాకు కుదిరాయని అంటున్నారు. 

* నాకు కూడా గ‌త ప‌దేళ్ల‌లో ఇంత పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమా ఆయ‌న ఫ్యాన్స్ దాహం తీర్చింది. ఏ డైరెక్ట‌ర్‌కు అయినా ఓ హీరో , ఫ్యాన్స్‌ ఫీల‌య్యే సినిమా చేస్తే దాన్ని క‌న్నా గర్వంగా ఫీల‌య్యే క్ష‌ణ‌మే ఉండ‌దు. నేను ఇప్పుడు అలాంటి హ్యాపీ మోడ్‌లో ఉన్నాను

* ఒక క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం అంద‌రం క‌లిసిపోతుంటాం. ఇక్క‌డ గొడ‌వ‌లు ప‌డే మ‌నం అమెరికా వెళ్ల‌గానే ఇండియ‌న్స్ అనే భావ‌న వ‌స్తుంది. అలాగే ఉత్త‌రాదికి వెళ్లిన‌ప్పుడు తెలుగువాళ్ల‌మ‌నే ఫీలింగ్‌తో క‌లిసిపోతాం. 

* నేను డైలాగ్స్ రాసుకునే స‌మ‌యంలోనే ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకుపోవాల‌నేదే నా ఉద్దేశం. అందుకే ముందు ఒక‌లా చూపించినా, క్లైమాక్స్‌లో అంద‌రూ క‌లుసుకుని క‌ప్ కొట్టుకొచ్చేలా చూపించాను. 

* ఈ సినిమా క్లైమాక్స్ ఎడిట్‌ చేయ‌డానికి ఇర‌వై రోజులు తీసుకున్నాను. క్లైమాక్స్‌ను రెండు భాగాలుగా తీశాను. దాన్ని మిక్స్ చేసి ప్రేక్ష‌కులు మెప్పించేలా ఎడిట్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. 

* ఇండియా, పాకిస్థాన్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకున్న‌ప్పుడు, చివ‌రి వ‌ర‌కు మ‌నం గెలుస్తామా లేదా? అనిపించిన‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్‌కు మూడు రోజులు ఉన్న‌ప్పుడు అర‌గంట కంటే ఎక్కువసేపు నిద్ర‌పోలేదు. 

* ఈ సినిమాకు చాలా ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అయితే నిర్మాత‌లు మాకు స‌పోర్ట్‌గా నిలిచారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌మైతే ఉండింది. కానీ తెలియ‌ని భ‌య‌మొక‌టి లోలోప‌ల ర‌న్ అవుతుండింది. వినాయ‌కుడు మా భ‌యాల‌ను ప‌టాపంచ‌లు చేసేశాడు. 

* ఇది హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ప్రేక్ష‌కుల విజ‌యంగా భావిస్తున్నాను. థియేట‌ర్‌కు ప్రేక్ష‌కులు రావాల‌ని అనుకోవ‌డంతో ఈ స‌క్సెస్ ద‌క్కింది. 

* త‌మ‌న్నాగారితో హ్యాట్రిక్ విజ‌యం సాధించడం హ్యాపీ. అలా కుదిరిపోయింది. 

* ఓటీటీ అనేది మంచి ఫ్లాట్‌ఫామ్ అన‌డంలో సందేహం లేదు. సినిమా చేసేట‌ప్పుడు అది థియేట‌ర్ మూవీనా, ఓటీటీ మూవీనా అని ప్లాన్ చేసుకుని చేస్తే బావుంటుంది. 

* నెక్ట్స్ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాను.

Director Sampath Nandi Interview :

Director Sampath Nandi Interview about Seetimaarr

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ