Advertisement

అరేయ్ జగదీష్.. మగవాడు ఏడవకూడదు. -నాని

Fri 10th Sep 2021 12:37 AM
tuck jagdish,tuck jagdish movie,tuck jagdish review,hero nani interview,hero nani,  అరేయ్ జగదీష్.. మగవాడు ఏడవకూడదు. -నాని
Hero Nani interview అరేయ్ జగదీష్.. మగవాడు ఏడవకూడదు. -నాని
Advertisement

ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఉండే సినిమా టక్ జగదీష్ -నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిన్నుకోరి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నాని మీడియాతో ముచ్చటించారు.

థియేటర్లో నన్ను నేను చూసుకోవడం కూడా మిస్ అవుతున్నాను. గత ఏడాది V సినిమాతో వచ్చాను. ఈ సారి టక్ జగదీష్ చిత్రంతో వస్తున్నాను. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతే ఇలా రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే అంతా సెట్ అవుతుందో థియేటర్‌లోకి వచ్చేందుకు రెడీగా చాలా సినిమాలు ఉన్నాయి.

నేను ఏదో సినిమా డబ్బింగ్ పనుల్లో ఉన్నప్పుడు శివ ఫోన్ చేశారు. ఓ కథను చెప్పాలని అన్నారు. అప్పటికే మజిలీ సూపర్ హిట్ అయి ఉంది. మళ్లీ అలాంటి కథే చెబుతారేమో అనుకున్నాను. ఆ జానర్ అయితే వద్దని చెబుదామని అనుకున్నాను. ఇలా ఫోన్‌లో నో చెప్పడం ఎందుకు.. నేరుగా చెబుదామని అనుకున్నాను. అప్పటికీ కథ అంతా కూడా పూర్తి కాలేదు. కానీ ఓపెనింగ్ లైన్ చెప్పాడు. భూదేవీపురం, భూమి తగాదాలు అని చెప్పారు.  నాజర్ లాంటి పెద్ద మనిషి వాయిస్ వినిపిస్తుంది.. అరేయ్ జగదీష్.. మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు అని చెబుతాడు. అలా చెప్పడంతోనే కనెక్ట్ అయిపోయాను. ఇంత వరకు సంబంధం లేని జానర్‌ను టచ్ చేయబోతోన్నాడని తెలిసింది. శివ నిర్వాణ ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేయగలరు. అలాంటి వారు ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా చేయగలరు. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. దానికి శివ నిర్వాణ దర్శకుడు అవ్వడం ఇంకా హ్యాపీ.

ఈ సినిమా అనుకున్నప్పుడు టైటిల్ టక్ జగదీష్ కాదు. అది క్యారెక్టర్ పేరు. ఇందులో ప్రతీ ఒక్క పాత్రకు మంచి మంచి క్యారెక్టర్ పేర్లు ఇచ్చారు. శివ నిర్వాణలో నాకు అదే నచ్చుతుంది. ఆయన చూసిన, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ల పేర్లు పెడతాడు. అందుకే అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. అదే పెద్ద బలం. అలా నాకు జగదీష్ అని పెట్టారు. అయితే  దానికి టక్ అని ముందు పెట్టారు. అతను టక్ ఎందుకు వేసుకుంటాడు అనేది ద్వితీయార్థంలో రివీల్ చేస్తారు. అది శివ ఎంతో అద్బుతంగా రాశారు. ఆ సీన్‌కు ఎంతో మంది కనెక్ట్ అవుతారు.

ఫ్యామిలీ డ్రామాలో ఉన్న కాంప్లెక్సిటీని ముందు శివ నిర్వాణ చెప్పారు. నేను దాన్ని ట్విస్ట్‌గా అనుకోవడం లేదు. మర్డర్ మిస్టరీలో ఉండే ట్విస్టులు కావు. మనం ఓ వ్యక్తిని ఒకలా అనుకుంటాం. కానీ అతను అలాంటివాడు కాదని తెలుస్తుంది. దాన్ని కథలో అందంగా తీసుకొచ్చారు శివ నిర్వాణ.

రీతూ వర్మ ఏమో లవ్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉన్న సినిమాలో రీతూ వర్మ ఓ రిలాక్స్‌లా అనిపిస్తుంది. ఈ కథ, డ్రామాకు ఆయువుపట్టు ఐశ్వర్య రాజ్ పాత్ర. చంద్రమ్మ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తారు. చంద్రమ్మ కోసం టక్ ఎంత దూరం వెళ్తాడన్నదే కథ.

ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. కానీ ఈసినిమాకు ముందుండే రెండు ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నదమ్ములు. బోసు,  జగదీష్ మధ్య ఉండే సంఘర్షణను శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసేశారు. హీరో ఎంత తపన పడతాడో అనే యాంగిల్‌లోనే తెలుగు సినిమాలుంటాయి. కానీ హీరో నాన్న యాంగిల్‌లోంచి చూడరు. కానీ శివ నిర్వాణ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌లోకి వెళ్తారు. అందువల్లే ప్రతీ పాత్ర హైలెట్ అవుతుంది.

ఎంటర్టైన్మెంట్ అంటే మనల్ని ఎంగేజ్ చేయడం. అంతే కానీ కేవలం కామెడీనే కాదు. రెండున్నర గంటలు మీరు సినిమాను చూసి.. దాంట్లోనే ఇన్వాల్వ్ అయి బయటకు వచ్చారనుకోండి. అది ఎంటర్టైన్మెంట్. నటుడిగా అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలి. నటుడు అంటే ఏంట్రా.. వాళ్లు ఏడిస్తే మనం ఏడవాలి..వాళ్లు నవ్వితే  మనం నవ్వాలి అనే మాటలు చిన్నతనంలో విన్నాను. అది అలా నాటుకుపోయింది. పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్ వంటి సినిమాల్లో ఎప్పుడూ మిస్ అవ్వలేదు. అంటే సుందరానికీ అనే సినిమాలో సీటులో ఎవ్వరూ కూర్చుండలేరు. వస్తే అలాంటి సినిమాతో రావాలి. నవ్వించిన సినిమాలు, ఏడిపించిన సినిమాలున్నాయి. కంప్లీట్ యాక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది. అన్ని రకాల సినిమాలు చేయాలి.. నన్ను నేను పరీక్షించుకోవాలి. చాలెంజింగ్ ఉన్న పాత్ర ఇస్తేనే నాకు కథకు ఓకే చెప్పాలనిపిస్తుంది. శ్యాం సింఘరాయ్ అద్భుతంగా ఉండబోతోంది. ఇకపై కొత్త నానిని చూస్తారు. అంటే సుందరానికీ ఫస్ట్ లుక్ చూస్తేనే షాక్ అవుతారు.

హిట్లు, సక్సెస్ వెంటపడుతూ.. మంచి మార్కెట్ ఉన్న హీరోగా ఉండాలా? మంచి నటుడిగా ఉండాలా? అనే దాన్ని బట్టి కథల ఎంపిక ఉంటుంది. అందుకే ఒకే రకమైన పాత్రలను చేయాలని అనుకోలేదు. వీ, టక్ జగదీష్ వంటి సినిమాలు చేశాను. కాబట్టి అందుకే అంటే సుందరానికి అనే ప్రేమ కథను చేస్తున్నాను.

సూపర్ సక్సెస్ అవుతుందని తెలిసి కూడా వదిలేసిన సినిమాలున్నాయి. అందులో రాజా రాణి ఒకటి. నేను అట్లీని ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ అప్పుడు నేను పైసా, ఎటో వెళ్లిపోయింది మనసు చేస్తున్నాను. నాకోసం ఏడాది ఆగడం మంచిది కాదు అని నిర్మాతలకు చెప్పాను. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని, పెద్ద దర్శకుడు అవుతాడని కూడా చెప్పాను. అలానే అయింది. ఇక ఎఫ్ 2 కథ సైతం విన్న వెంటనే బ్లాక్ బస్టర్ అని చెప్పాను. నా కోసం అనిల్, దిల్ రాజు గారు నాతో అనుకున్నారు. కానీ అది నా స్పేస్ కాదని అనుకున్నాను.

ఎంసీఏ లాంటి సినిమాలకు రివ్యూలు, మౌత్ టాక్ బాగా లేవు. కానీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. అది సూపర్ హిట్ అంటున్నారు. కానీ V సినిమాకు మంచి రివ్యూలు రాలేదు. కానీ అమెజాన్ వారు మాత్రం మంచి రియాక్షన్ ఇచ్చారు. అమ్మిన రాజు గారు హ్యాపీగా ఉన్నారు. కొన్న అమెజాన్ వారు హ్యాపీగా ఉన్నారు. V సినిమాను మించిన ఆఫర్ ఈ సినిమాకు ఇచ్చారు. అంటే ఆ సినిమా హిట్టు అయినట్టే కదా? ఆ విషయం చెప్పడానికి  నా దగ్గర సరైన వివరణ గానీ, కలెక్షన్ల లెక్కలు కానీ లేవు.

నాకు రీమేక్స్ సరిపోవు. రీమేక్స్ చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కెరీర్ ప్రారంభంలో  చేశాను. భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం చేశాను. ఇప్పటికీ భీమిలీ కబడ్డీ జట్టు సినిమాకు అభిమానులున్నారు. కానీ ఆహా కళ్యాణం అంతగా ఆడలేదు. రీమేక్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. నాలో ఉందని నాకే తెలియందని, మీకు కొత్తగా చూపించాలనే ఆలోచనలకు రీమేక్ సరిపోవు. మనం సినిమాలు చేద్దాం. మన సినిమాలను వాళ్లు రీమేక్ చేసేలా చేద్దాం. ఇప్పుడు నా ఆరు సినిమాలో ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి.

టక్ జగదీష్ సినిమా తెలుగు ప్రేక్షకుల కథ. తెలుగు కుటుంబాలకు సంబంధించిన కథ. ఇది రీమేక్ అయ్యే చాన్స్ లేదు. ఇది తెలుగు సినిమా మాత్రమే. అమెజాన్‌లో ఈ  సినిమాను సబ్ టైటిల్స్‌లో ఇతర భాషల వారు చూసి.. బాగుందని అంటే చాలు.

సబ్ టైటిల్స్ చూసి సినిమాలను చూసేస్తున్నారు. నాక్కూడా అది అలవాటు అయింది. ఇప్పుడు మనీ హీస్ట్ సిరీస్ ఉంది. దాన్ని వేరే భాషలో తీశారు. కానీ ఇంగ్లీష్‌లోకి డబ్ చేశారు. నాకు సబ్ టైటిల్స్ అలవాటు అయ్యాక.. ఇంగ్లీష్‌లో  చూడాలనిపించడం లేదు. స్పానిష్‌లోనే చూస్తున్నాను. ఇప్పుడు దేశంలో అందరికీ సబ్ టైటిల్స్‌తో సినిమాను చూడటం అలవాటు చేసుకుంటున్నారు. అందుకే ఇంకొన్ని రోజుల్లో ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే సబ్ టైటిల్స్‌తో సినిమాలు చూడటానికే ఇష్టపడతారు. అందుకే మంచి సినిమాను చేస్తే.. సబ్ టైటిల్స్‌తో అందరూ చూస్తారు. అందుకే  నేను ప్యాన్ ఇండియా అనే దాన్ని అంతగా నమ్మను.

నాని ఫాస్ట్‌గా సినిమాలు రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ వేవ్‌లో ఒకటి, సెకండ్ వేవ్‌లో మరొకటి వచ్చాయి. మిగతా వాళ్ల సినిమాలు రెడీగా లేవు. అందుకు ఎగ్జిబిటర్లు అలా అన్నప్పుడు బాధేసింది. థియేటర్లు సెట్ అయితే.. నేను మూడు సినిమాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. టక్ జగదీష్ వెళ్లిపోతోందని వారు బాధపడుతున్నారు. కానీ మీరు రెడీ అంటే.. రెండు మూడు సినిమాలు ఇచ్చేందుకు నేను కూడా రెడీగా ఉన్నాను.  పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ప్యాండమిక్ సమయంలోనూ ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి సమయంలోనూ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చుని చూసే మంచి సినిమా ఇస్తున్నాను. ఇక ఈ ప్యాండిమక్ సమయంలో నా సినిమాల వల్ల ఎంతో మందికి పని దొరికింది. రేపు థియేటర్లు రెడీ అవ్వగానే శ్యాం సింఘరాయ్ కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి. ఎలా చెప్పాలి.

ఓటీటీ అనేది ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇండస్ట్రీ కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. సినిమాలకు మరో ఫ్లాట్ ఫాంలా ఉంటుంది. అన్ని  రకాలుగా మంచిదే. అయితే థియేటర్లు అనేది ఎప్పటికీ ఉంటుంది. థియేటర్లు మూతపడతాయి అని అనుకునేవాళ్లకు వాటి గొప్పదనం తెలియదన్నట్టే. థియేటర్లను కొట్టే  ఆప్షన్ ప్రపంచంలో లేదు.

ఇంటర్వెల్ కార్డ్ పడటం లేదని చాలా బాధపడ్డాను. అమెజాన్ వాళ్లు అలా వేయరు అని తెలుసు. అయితే ట్విట్టర్‌లో షేర్ చేస్తాను. ఆ ఫ్రేమ్ ఇంటర్వెల్ అని చెప్పేందుకు పోస్ట్ చేస్తాను. అమెజాన్ వారు ఇంటర్వెల్ ఇవ్వకపోయినా నేను ఇస్తాను.

HIT సీక్వెల్ అద్భుతంగా ఉండబోతోంది. మొదటి పార్ట్ కంటే సూపర్‌గా ఉంటుంది. అడివి శేష్‌తో చేస్తున్నాం. దాదాపుగా డెబ్బై శాతం షూటింగ్ అయింది. ఇక మూడో  పార్ట్ అంతకు మించి అనేలా ఉంటుంది. మీట్ క్యూట్ కూడా స్పెషల్‌గా ఉండబోతుంది. దానికి మా అక్క దర్శకురాలు. చిన్నప్పటి నుంచి తిరిగిన, చూసిన మా అక్కలో ఇంత టాలెంట్ ఉందా? అని షాక్ అయ్యాను. మీట్ క్యూట్‌తో అక్క నన్ను మరిచిపోయేలా చేస్తుంది.

అంటే సుందరానీకి సినిమా ఇచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. పరిస్థితులు చక్కబడితే శ్యాం సింఘరాయ్‌ను రెడీ చేస్తాను.

సీటీమార్, తలైవి అద్భుతంగా విజయం సాధించాలి. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి. అలాగే టక్ జగదీష్ చిత్రాన్ని కూడా చూడండి.

Hero Nani interview:

Hero Nani interview

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement