ఇంటర్నేషనల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ విన్నర్ కంటే నటుడిగా అశ్మీ విజయం నాకెంతో సంతోషాన్నిచ్చింది.. నటుడు రాజా నరేంద్ర ఆకుల
సాచీ క్రియేషన్స్ పతాకం పై రుషికా రాజ్, రాజా నరేంద్ర ఆకుల, కేశవ్ దీపిక నటీనటులు గా నూతన దర్శకుడు శేష్ కార్తీకేయ దర్శకత్వంలో పూర్తిగా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో థ్లిలర్ నేపథ్యంలో స్నేహా రాకేశ్ నిర్మిస్తున్న చిత్రం అశ్మీ. ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలై విజయ వంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన ఇంటర్నేషనల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ విన్నర్ రాజా నరేంద్ర ఆకుల సినీజోష్ తో మాట్లాడుతూ..
మాది వెస్ట్ గోదావరి లోని ఏలూరు చిన్నప్పటి నుండి నాకు నటుడు అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఆ తరువాత ప్రభాస్ గారి ఈశ్వర్ సినిమా చూసిన తరువాత ప్రభాస్ గారిని ఫాలో అయ్యి ఎదో విధంగా సినీ ఇండస్ట్రీ కు వెళ్లాలని నేను బాడీ బిల్డింగ్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి స్పోర్ట్స్ లో రాణిస్తూ ఆయన ఇన్స్పిరేషన్ తోనే నేను ఇంటర్నేషనల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ విన్నర్ అయ్యాను.
బాడీ బిల్డర్ మరియు యాక్టర్ అవ్వాలనే మా నాన్న గారి కలను నెరవేర్చడానికి బాడీ బిల్డర్ గా ఎంతో కష్టపడి ఇంటర్నేషనల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ సాధించి ఇపుడు ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకున్నాను. నేను యాక్టర్ గా సినిమాల్లోకి వెళ్తానంటే 99 శాతం మంది వద్దు అన్నారు. కానీ నేను చిన్నప్పటి నుండి నటుడవ్వాలనే కోరిక సినిమా మీద ఫ్యాషన్ ఇప్పటికీ తగ్గక పోవడంతో ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకొని సినిమాల్లోకి రావడం జరిగింది.
ఈ చిత్ర దర్శకుడు శేషు కార్తికేయ నేను టీనేజ్ నుంచి కలిసి పెరిగాము.కార్తికేయ దర్శకత్వ శాఖలో మెలకువలు నేర్చుకున్నాడు. నేను స్పోర్ట్స్ లో మిస్టర్ వరల్డ్ టైటిలే విన్నర్ అయిన తర్వాత చిన్నప్పటి నుండి సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ ను గమనించిన నామిత్రుడు నాకు ఈ సినిమా కథ చెప్పడం జరిగింది.ఆ తర్వాత మేమిద్దరం ఆ కథను డెవలప్ చేసి స్నేహా రాకేశ్ కు కథ చెప్పడంతో నిర్మాతగా తను ఈ సినిమా చేస్తానని ముందుకు వచ్చారు. ఈ సినిమాకు నా చిన్ననాటి స్నేహితుదు శేషు కార్తికేయ దర్శకుడిగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మేమంతా కొత్తవారమైనా కూడా సినిమాను విజయ వంతంగా పూర్తి చేశాము. కానీ ఈ సినిమా తీయడం ఒక ఎత్తయితే ఆలాగే ఈ సినిమాను తెరమీదకు తీసుకు రావడం ఒక ఎత్తు. సినిమా అయితే చేశాము కానీ ఎలా రిలీజ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏలూరు శీను గారికి మా సినిమా కంటెంట్ నచ్చడంతో తను ఈ సినిమాను ఆడాప్ట్ చేసుకొని థియేటర్స్ లలో రిలీజ్ అయ్యేలా చేసి సినిమాను ఇంత దూరం తీసుకొచ్చారు. ఈయన మా పాలిట బాహుబలి లాగా మాకు దొరికాడు. శ్రీను గారు వారి టీం చేసిన సహాయం మేము మరవలేము. సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవుడి దయవల్ల సినిమా సక్సెస్ అయింది. సినిమా చూసిన జర్నలిస్టులకు సినిమా నచ్చడంతో జన్యున్ గా వారిచ్చిన రివ్యూ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. వారందరికీ నా ధన్యవాదాలు.
ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అయినా ఇందులో క్యారెక్టర్స్ సమానంగా ఉంటాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం చాలా ఏరియాలకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ప్యాండమిక్ స్విచ్వేషన్ తరువాత కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మా సినిమాను అందరూ థియేటర్స్ కు వచ్చి చూడాలని మేము చాలా ఏరియాలలో రోడ్లమీద ప్లకార్డ్స్ పట్టుకొని కొత్తరకం ప్రమోషన్స్ చేయడం జరిగింది. నిర్మాతలు లేనిదే నటులు లేరని భావించే ఇటువంటి కొత్తరకం ప్రమోషన్ చేయడం జరిగింది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కథలు రావాలంటే కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకు చాలా అవసరం, వారే అన్న దాతలు. వారు ఇండస్ట్రీలో నిలబడాలంటే చిత్ర యూనిట్ అంతా కూడా కష్టపడి సినిమా విజయంలో బాగస్వామ్యులు అవ్వాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్.
చిరంజీవి గారు, ప్రభాస్ గారు అందరు కూడా వెస్ట్ గోదావరిని ఒక స్టాయి తీసుకెళ్లారు. ఇప్పుడు మా వంతు వచ్చింది మేము కూడా మావంతు ఒక చిన్న ప్రయత్నం చేయాలని ఈ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే చాలా మంది థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. మా సినిమా చూసిన వారంతా కూడా సినిమా బాగుంఫణి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.కానీ ప్రతి సినిమాకి ఎంతోకొంత నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది.కానీ ఈ సినిమాకు ఆడియన్స్ దగ్గర నుండి ఒక్క శాతం కూడా నెగెటివ్ ఫీలింగ్స్ రాలేదు. సినిమా చాలా బాగా తీశారని ప్రశంసించారు. అలాగే నన్ను నమ్మి నాపై నమ్మకంతో ఈ సినిమా చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ 14 రీల్స్ వారి ప్రొడక్షన్ లో అనీశ్ కురిగాల్లా దర్శకత్వంలో ఎనిమిది ఎపిసోడ్స్ వుండే హాట్ స్టార్ ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ ఒకటి చేశాను. ఇందులో నేను, ప్రియానంద్ కలసి నటించాము త్వరలో రిలీజ్ అవుతుంది. తరువాత ఒక కామెడీ మూవీ చేస్తున్నాను. ఇది కాకుండా జనవరి లో సోనీ రవి తో ఒక ప్రాజెక్టు చేస్తున్నాను. ఇలా నేను కొత్త కథలను ఎంచుకొని కొత్త జోనర్లు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి మెప్పించాలను కుంటున్నాను.. అని ముగించారు.